యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే షూటింగ్ సగానికిపైగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.
ఇక ఈ సినిమా పూర్తిగాక ముందే, తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెడుతున్నాడు ఈ హీరో.ఈ క్రమంలోనే మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ తన 21వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాను పూర్తి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఇక ఈ సినిమా పట్టాలెక్కకముందే, మరో ప్రెస్టీజియస్ మూవీని తెరకెక్కించేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడు.
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్‌లో ‘ఆదిపురుష్’ అనే మైథలాజికల్ మూవీని తెరకెక్కించేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడు.ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇటీవల వచ్చిన సంగతి తెలిసిందే.
రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా గ్రాఫిక్స్‌కు పెద్దపీట వేసే ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలో ప్రారంభించడమే కాకుండా, వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
అయితే ఈ సినిమా మెజారిటీ శాతం షూటింగ్ పూర్తిగా వీఎఫ్ఎక్స్‌లో తెరకెక్కనుండటంతో, ఎక్కువ భాగం షూటింగ్ గ్రీన్ మ్యాట్స్‌పైనే చేయనున్నారు.అందుకే ఈ సినిమా షూటింగ్ చాలా త్వరగా పూర్తి చేయొచ్చని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఈ క్రమంలోనే ప్రభాస్‌తో సహా పలువురు కీలక నటీనటులను పెట్టి గ్రీన్ మ్యాట్‌పై షూటింగ్‌ను పూర్తి చేసేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈ లెక్కన ఆదిపురుష్ చిత్రం ప్రేక్షకులు ఊహించిన దానికంటే ముందుగానే పూర్తవుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఏదేమైనా ప్రభాస్ ఎంచుకునే సినిమాలే కాదు, ఆయన వాటిని తెరకెక్కించే విధానం కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుండటంతో ఇప్పుడు అందరి చూపులు ఆయనపైనే ఉన్నాయనేది వాస్తవం.