Adi purush Review: ఆదిపురుష్ రివ్యూ: రాఘవునిగా ప్రభాస్ హిట్ కొట్టినట్లేనా?

డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా ఇతిహాసం రామాయణం అనే పౌరాణిక నేపథ్యంలో రూపొందింది.

ఇందులో బాలీవుడ్ నటి కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవ దత్తనాగే తదితరులు నటించారు.ఈ సినిమాను టీ సిరీస్ ఫిలిమ్స్, రెట్రోఫిల్స్ బ్యానర్( T Series Films, Retrofils Banner ) పై నిర్మించారు.

ఇక ఈ సినిమాకు సంచిత్ బల్హర, అంకిత్ బల్హర లు స్కోర్ అందించగా అజయ్ - అతుల్, సాచెట్ - పరంపర సంగీతాన్ని అందించారు.ఇక ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ భాషలో కూడా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు వెలువడ్డాయి.రామాయణం తెలిసిన కథ అయినప్పటికీ కూడా ప్రేక్షకులు ఈ సినిమాపై బాగా ఆసక్తి పెంచుకున్నారు.

Advertisement

ఇక ఈరోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో.ప్రభాస్ కు ఎటువంటి సక్సెస్ అందించిందో చూద్దాం.

కథ: కథ విషయానికి వస్తే రామాయణం( Ramayanam ) గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.ఇప్పటికే రామాయణం నేపథ్యంలో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి.

తెలిసిన కథ అయినప్పటికీ కూడా చూడాలన్న ఆసక్తి బాగా ఉంటుంది.అలా ఇప్పుడు కూడా ప్రభాస్ రామాయణం కథతో ముందుకు వచ్చాడు.

ఇంకా రామాయణం లోని కొన్ని ముఖ్యమైన ఘట్టాల సమహారమే ఆదిపురుష్.తండ్రి మాట కోసం రాఘవడు (ప్రభాస్) 14 ఏళ్ళు భార్య సీత జానకి (కృతి సనన్) తో అరణ్యవాసానికి వెళ్తాడు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

ఆ తర్వాత లంకేశ్వరుడు( Lankeshwaradu ) (సైఫ్ అలీ ఖాన్) జానకిని అపహరిస్తాడు.అలా లంకేశ్వరుని ఆధీనంలో ఉన్న జానకిని కాపాడటం కోసం వానర సైన్యం సహాయంతో లంకేశ్వరుని అంతమొందించి రాఘవుడు ఎలా కాపాడాడు అనేది మిగిలిన కథలోనిది.

Advertisement

నటినటుల నటన: ఇప్పటివరకు ప్రభాస్ ను ఇటువంటి పాత్రలో ఎప్పుడు చూడలేదు.కానీ తొలిసారిగా రాముడు పాత్రలో కనిపించిన ప్రభాస్ అద్భుతంగా నటించాడు.తన ఎక్స్ప్రెషన్స్ తో కట్టిపడేశాడు.

పైగా తన లుక్ కూడా బాగా ఆకట్టుకుంది.ఇక జానకి పాత్రలో నటించిన కృతి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి.

సైఫ్ కూడా లంకేశ్వరుడు పాత్రలో అదరగొట్టాడు.ఇక హనుమంతు పాత్ర కూడా ప్లస్ పాయింట్ గా నిలిచింది.

మిగతా నటీనటులంతా పాత్రకు తగ్గట్టు న్యాయం చేశారు.

టెక్నికల్: టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ ఓం రౌత్( Director Om Rauth ) అందరికీ తెలిసిన కథనే మరోసారి చూపించాడు.పాత్రలకు తగ్గట్టుగా నటి నటులను ఎంచుకోగా లంకేశ్వరుడు పాత్రలో నటించిన సైఫ్ అలీ ఖాన్ కు లుక్ అంత సెట్ అవ్వలేదు అన్నట్లు అనిపించింది.సంగీతం బాగా ఆకట్టుకుంది.500 కోట్ల రూపాయలు పెట్టిన ఈ సినిమాలో కొన్ని లోపాలు కనిపించినట్లు అనిపించాయి.అంటే విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ ఎక్స్ అసంతృప్తి వ్యక్తం చేశాయి.

ఇక మిగిలిన నిర్మాణ విభాగాలు సినిమాకు తగ్గట్టుపనిచేసాయి.విశ్లేషణ: రామాయణంను సినిమా లాగా చూపించాలి అంటే అది పెద్ద సవాల్ అని చెప్పాలి.ముఖ్యంగా ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా రూపొందించాలి.

అలా డైరెక్టర్ ఓం రౌత్ కు ఈ సినిమా సవాల్ తో కూడిందని చెప్పాలి.అయినప్పటికీ కూడా ఆడియన్స్ మెప్పించే విధంగా ప్రయత్నించాడు.

కానీ కొన్ని కొన్ని చోట్ల కాస్త పొరపాటు చేసినట్లు కనిపించాడు.

ప్లస్ పాయింట్స్: ప్రభాస్, కృతి పర్ఫామెన్స్.ఫస్టాఫ్, సాంగ్స్.మైనస్ పాయింట్స్: విఎఫ్ ఎక్స్ అంతగా ఆకట్టుకోలేకపోయింది.విజువల్ ఎఫెక్ట్ పూర్ గా ఉన్నాయి.

సెకండాఫ్, కథనం, కొన్ని లుక్స్ పట్ల అసంతృప్తి.

బాటమ్ లైన్: చివరిగా చెప్పాల్సిందేంటంటే రామాయణం తెలిసిన కథ అయినప్పటికీ కూడా ప్రభాస్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఒక్కసారైనా చూడాల్సిన సినిమా అని చెప్పవచ్చు.కొంతవరకు ఈ సినిమా హిట్ ఖాతాలో పడినట్లే అని చెప్పాలి.రేటింగ్: 3/5.

తాజా వార్తలు