క్రేజీ ఫెలో రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

డైరెక్టర్ ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో రూపొందిన సినిమా క్రేజీ ఫెలో. ఈ సినిమాలో ఆది సాయికుమార్, మీర్నా మీనన్, దిగంగన సూర్యవన్షీ నటీనటులుగా నటించారు.

 Adi Saikumar Crazy Fellow Movie Review And Rating Details, Crazy Fellow,adi Saik-TeluguStop.com

ఇక ఈ సినిమా ట్రైయాంగిల్ లవ్ స్టోరీ గా రూపొందింది.ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకం పై కేకే రాధ మోహన్ నిర్మాతగా చేశాడు.

ఆర్ఆర్ ద్రువన్ సంగీతాన్ని అందించాడు.సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందించాడు.

ఇక ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.పైగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఆదికి ఈ సినిమా ఎటువంటి సక్సెస్ ను అందించిందో చూద్దాం.

కథ:

ఇందులో ఆది సాయికుమార్ అభిరామ్ పాత్రలో కనిపించాడు.ఇక అభిరామ్ మనసుకు నచ్చిన పని చేస్తూ తన జీవితాన్ని సరదాగా గడుపుతూ ఉంటాడు.

ఇక తను చేసే అల్లరి కూడా అంతా ఇంతా కాదు.తన అల్లరి వల్ల తన స్నేహితులతో పాటు ఇతరులు కూడా బాగా ఇబ్బంది పడుతూ కనిపిస్తారు.

అంతేకాకుండా తన ఆఫీసులో పనిచేసే మధుమతి (దిగంగన సూర్యవన్షీ) అనే అమ్మాయితో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాడు.ఇక అదే సమయంలో తనకు చిన్ని అనే అమ్మాయి డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అవుతుంది.

ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది.కానీ ఇద్దరు ఒకరికొకరు చూసుకోరు.

Telugu Adi Saikumar, Adisaikumar, Crazy Fellow, Crazyfellow, Mirna Menon, Review

దీంతో వారిద్దరూ ఒక కాఫీ షాప్ లో కలుసుకోవాలని అనుకుంటారు.కానీ అభి తను పరిచయం చేసుకున్న చిన్నిని కాకుండా మరో చిన్నికి (మీర్నా మీనన్) కు అనుకోకుండా ఐ లవ్ యు చెబుతాడు.దాంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటాడు.అయితే ఎంగేజ్మెంట్ జరుగుతున్న సమయంలో.తను ప్రేమించే చిన్ని ఆమె కాదు అని.తన ఆఫీసులోనే పనిచేసే మధుమతి అని నిజం తెలుస్తుంది.దీంతో అభి తన తప్పులు ఎలా సరిదిద్దుకుంటారు అని.ఎప్పుడు గొడవ పడే మధుమతి మనిషి ఎలా గెలుచుకుంటాడు అనేది.ఇంతకు మరో చిన్ని ఎవరు అనేది మిగిలిన కథలోనిది.

నటినటుల నటన:

ఆది తన పాత్రతో బాగా ఆకట్టుకున్నాడు.హీరోయిన్స్ ఇద్దరు కూడా పర్వాలేదు అన్నట్లుగా ఉంది.మిగతా నటీనటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్:

టెక్నికల్ విషయానికి వస్తే దర్శకుడు ఈ సినిమాను రొటీన్ కథగా తెరకెక్కించిన కూడా కొంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పవచ్చు.సంగీతం కూడా పరవాలేదు.

సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంది.

Telugu Adi Saikumar, Adisaikumar, Crazy Fellow, Crazyfellow, Mirna Menon, Review

విశ్లేషణ:

చాలా వరకు ఈ సినిమా రొటీన్ గా వచ్చినట్లుగా అనిపించింది.కాస్త కన్ఫ్యూజన్ డ్రామాగా అనిపించింది.చాలావరకు ఈ పాయింట్ తో సినిమాలు వచ్చాయి.కానీ ఈ సినిమా కాస్త ఎంటర్టైన్ గా అనిపించింది.

ప్లస్ పాయింట్స్:

ఆది నటన, కామెడీ, సెకండ్ హాఫ్, ట్విస్ట్.

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించింది.కొన్ని సీన్స్ బోరింగ్ గా అనిపించాయి.ఫస్ట్ హాఫ్ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

బాటమ్ లైన్:

ఈ సినిమా కథ రొటీన్ గా అనిపించినా కూడా కాస్త ఆసక్తిగానే అనిపించింది.ఇక ఈ సినిమాను ఫీలింగ్ తో చూడవచ్చు అని చెప్పవచ్చు.

రేటింగ్: 2.5/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube