యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ ప్రజలు ఛీ కొట్టి తిరస్కరించినా బీఆర్ఎస్ పార్టీ నేతల బుద్ది మారలేదని యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి అన్నారు.బుధవారం గుండాల మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు అధికారంలో ఉండి,ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు.
లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసి,అక్రమంగా సంపాదించిన డబ్బుల అహంకారంతో నోటికొచ్చిట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే విచక్షణ కోల్పోయి,
ప్రజలను మభ్యపెడుతూ పూటకో మాట చెబుతూ గడీల కాపల కుక్కలైన బాల్క సుమన్ వంటి వాళ్ళతో చిల్లర మాటలు మాట్లాడిస్తున్నారని,నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించారు.
గతి తప్పి మతిలేని మాటలు మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రజాక్షేత్రంలో ప్రజలు మరోసారి తగిన బుద్ధి చెబుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇరసరపు యాదగిరి గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు ఏలూరు రామిరెడ్డి, కోల్కొండ యాదగిరి, రాజారత్నం,ఇమ్మడి దశరథ,షర్ఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.







