కోతితో పోల్చిన తన ముఖాన్ని చూసుకుంటూ మురిసిపోయిన ఆదాశర్మ.. వైరల్ వీడియో?

హార్ట్ ఎటాక్ సినిమాతో తొలిచూపులతోనే అందరి మనసులు దోచుకున్న ముద్దుగుమ్మ ఆదాశర్మ. తన అందంతో కుర్రాళ్ల మతి పోగొట్టిన ఈ ముద్దుగుమ్మ.

తెలుగు ప్రేక్షకులతో మంచి అభిమానం సంపాదించుకుంది.తన నటనపరంగా కూడా కొంతవరకు మెప్పించింది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ, భాషల్లో కూడా తన నటన ను పరిచయం చేసింది ఈ ముద్దుగుమ్మ.2008లో హారర్ సినిమాతో హిందీ సినీ పరిశ్రమకు పరిచయం అయింది.ఈ సినిమాతో తన నటన వల్ల ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది.

ఆ తర్వాత 2014లో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తొలిసారిగా పరిచయం అయింది.ఇక ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకున్న కూడా అంత గుర్తింపు తెచ్చుకోలేక పోయింది ఈ బ్యూటీ.

Advertisement

కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ కూడా తన పాత్ర అంతగా సక్సెస్ కాలేకపోయింది.ఇక అక్కడి నుండి మళ్లీ బాలీవుడ్ లో అడుగుపెట్టింది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఇక బుల్లితెరపై కూడా పలు వాణిజ్య పరమైన ప్రకటనలు కూడా చేసింది.

ఇక సోషల్ మీడియాలో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను, వీడియోలను అభిమానులతో బాగా షేర్ చేసుకుంటుంది తన డాన్స్ వీడియో లతో బాగా సందడి చేస్తుంది.ప్రస్తుతం ఈ అమ్మడుకు అంతగా అవకాశాలు లేకపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు టచ్ లో ఉంటుంది.ఇక తన హాట్ హాట్ అందాలతో ఫోటో షూట్ చేయించుకుంటూ వాటిని బాగా షేర్ చేసుకుంటుంది.

నిత్యం ట్రెండీని ఫాలో అవుతూ ఉంటుంది.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

ఇక తన అందాలతో కుర్రాళ్లను తన వైపు మలుపుకుంటుంది.టాలీవుడ్ లో కాకుండా ప్రస్తుతం ఇతర భాషలో బాగా బిజీగా ఉంది ఆదా.అక్కడ బాగానే అవకాశాలు అందుకుంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టాలో ఒక వీడియో షేర్ చేసుకుంది.

Advertisement

అయితే ఆ వీడియో తన ఫ్యాన్ పేజ్  నుండి తీసుకొని షేర్ చేసింది.అయితే అందులో మొదట.కోతి ఫోటో రాగా ఆ తర్వాత తన ఫోటో వచ్చింది.

అంటే కోతి రూపం నుండి తన రూపం వచ్చినట్లుగా ఎడిట్ చేశారు.ఆ తర్వాత మరో జంతువు ఫోటోతో కూడా ఎడిట్ చేశారు.

దీంతో ఆ వీడియోను పంచుకున్న ఆదా తనను అలా పోల్చినందుకు ఏమాత్రం ఫైర్ కాకుండా మురిసిపోయినట్లు కనిపించింది.ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవ్వగా.

ఆ వీడియో చూసిన నెటిజన్స్.మీ స్థానంలో మరో హీరోయిన్ ఉంటే వెంటనే ఫైర్ అయ్యేవాళ్ళు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం తను వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

తాజా వార్తలు