ఈ రోజు జరిగిన బీజేపీ చలో హుజురాబాద్ యాత్రలో అపశృతి చోటుచేసుకున్న విషయం తెలిసిందే.ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్ రావు, ఆ పార్టీ సీనియర్ నాయకురాలు విజయ శాంతి, మాజీ ఎంపీ వివేక్ పాల్గోన్నారు.
ఈ నేపధ్యంలో గిరిజన భరోసాయాత్ర పేరుతో గిరిజన భూములను సందర్శించారు.అయితే గుర్రంపోడులో న్యాయం కోసం పోరాడుతున్న గిరిజనుల పై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని మండిపడుతున్నారు బీజేపీ నేతలు.
అయితే ఈ విషయంలో తీవ్రంగా స్పందించిన పార్టీ సీనియర్ నాయకురాలు విజయ శాంతి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ వస్తే ఇక్కడి ప్రజలకు కాపలగా ఉంటానని మాట్లాడిన కేసీయార్, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తానే పదవి చేపట్టి తెలంగాణ ప్రజలను, నిధులను అందినకాడికి దోచుకుంటున్నారని విమర్శించారు.
టీఆర్‌ఎస్‌కు రెండోసారి అధికారం ఇచ్చి ప్రజలు తప్పు చేశారని, కాగా ఇంతకు ముందు కేసీఆర్‌తో కలిసి పనిచేసినందుకు సిగ్గు పడుతున్నానని అన్నారు.
అంతే కాకుండా తానే ఇంకా పదేళ్ల వరకు పదవులు అనుభవిస్తూ సీఎంగా ఉంటే తెలంగాణ ఏమై పోతుందోనని ఆవేదన కలుగుతుందని వెల్లడించారు.
ఇక దొరల పాలనకు అంతం పలకాలంటే ప్రజలు టీఆర్‌ఎస్ నేతలపై తిరగబడాలని పిలుపునిచ్చారు.
అయినగానీ పదవిలో లేనప్పుడు వంద చెబుతారు.అధికారంలోకి వచ్చాక ప్రజల నడ్దివిరగ్గొడతారు.
ఇలాంటి మాటలు చెప్పే నాయకుల్ని ఎందర్ని చూడలేదని అనుకుంటున్నరట ఓటర్లు.