ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గాను అలాగే ఎన్నో సినిమాలలో స్టార్ హీరోలు అందరికీ చెల్లెలు గాను నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి వరలక్ష్మి ( Varalakshmi ) ఒకరు.ఈమె దాదాపు 100 సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.
అలాగే మరో వంద సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి వరలక్ష్మి ఉన్నఫలంగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెరపై ప్రారంభించారు .ఇలా బుల్లితెర సీరియల్స్ లో విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇలా బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్నటువంటి ఈమె చాలా రోజుల తర్వాత ఒక ఇంటర్వ్యూకి హాజరయ్యారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా వరలక్ష్మీ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.తాను సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న సమయంలో నిజ జీవితంలో ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా సినిమాలో నేను ప్రెగ్నెంట్ గా నటించాల్సి వచ్చింది.
అలా ప్రెగ్నెంట్ గా నటించే సమయంలో చాలా ఇబ్బందులు పడ్డానని ఆ క్షణం నుంచి తాను సినిమాలకు దూరమయ్యానని ఈమె తెలియచేశారు.
ఇలా పెళ్లి తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరమైనటువంటి తాను బుల్లితెరపై సీరియల్స్ చేస్తున్నానని తెలిపారు.అయితే తిరిగి సినిమాలలో అవకాశం వచ్చిన తప్పకుండా చేస్తానని తెలిపారు.అయితే ఒకప్పుడు నేను చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి హీరోలకు చెల్లెలు పాత్రలలో నటించాను.
ఇప్పుడు యంగ్ హీరోలు అయినటువంటి ప్రభాస్( Prabhas ) అల్లు అర్జున్( Allu Arjun ) , మహేష్ బాబు( Mahesh Babu )!వంటి యంగ్ హీరోలకు తల్లి పాత్రలలో నటించాలని ఉంది అంటూ ఈ సందర్భంగా ఈమె తన మనసులో కోరికను బయటపెట్టారు.మరి ఈమె కోరికను దర్శక నిర్మాతలు తీరుస్తారా ఈమెకు తిరిగి సినిమాలలో అవకాశం ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.