హీరోయిన్ త్రిష( Trisha ).ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఈమె సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ కొన్ని ఏళ్ళు పూర్తి అవుతున్న కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ దూసుకుపోతోంది.అందం విషయంలోనే కాకుండా అవకాశాల విషయంలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడం లేదు ఈ బ్యూటీ.
ఇప్పటికీ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.ప్రస్తుతం కోలీవుడ్( Kollywood ) లో వరుసగా అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తోంది త్రిష.
ఇది ఇలా ఉంటే ఇటీవలే త్రిష పొన్నియిన్ సెల్వన్( Ponniyin Selvan ) సినిమాతో కోలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

కాగా మొన్నటి వరకు ఎక్కువగా సినిమాలపైనే ఫోకస్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అలాగే తన సినిమాలకు సంబంధించిన అప్డేట్ ల గురించి ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంది.ఈ నేపథ్యంలోనే తాజాగా త్రిష తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ప్రస్తుతం తమిళంలో త్రిష ది రోడ్ అనే సినిమాలో నటిస్తోంది.
ఈ సినిమాకు వసీగరన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.ఇది ఇలా ఉంటే ఇటీవల త్రిష పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

కాగా తాజాగా త్రిష ఈ సినిమా సెట్స్ లో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలో త్రిష చంటి బిడ్డని ఎత్తుకొని మురిసిపోతూ కనిపించింది.ఆ ఫోటోని చూసిన కొందరు నెటిజన్స్ త్రిషకీ కూడా పెళ్లి అయి ఉంటే ఇలాగే ఒక కొడుకు ఉండేవాడేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కొందరు నెటిజన్స్ ఆ ఫోటోని చూసి త్రిష ఇందులో తల్లిగా నటించనుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే నాలుగు పదుల వయస్సు వచ్చిన త్రిష ఇంకా బ్యాచిలర్ లైఫ్ నే లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే.కానీ త్రిష అందాన్ని చూస్తే ఆమె ఇంకా 25 ఏళ్ల అమ్మాయి లాగే కనిపిస్తోంది.
కాగా ప్రస్తుతం త్రిష చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి.







