దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ నీట్ -2023 ఇవాళ జరగనుంది.మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.ఇందుకోసం తెలుగు రాష్ట్రాల్లో సుమారు 298 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
వీటిలో ఏపీలో 140 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు కాగా రాష్ట్రం నుంచి 68 వేల 22 మంది నీట్ కు దరఖాస్తు చేశారు.ఇటు తెలంగాణలో 158 సెంటర్లు ఏర్పాటు చేయగా… 73 వేల 808 మంది పరీక్షకు హాజరుకానున్నారు.
అయితే దేశ వ్యాప్తంగా తెలుగుతో పాటు 13 భాషల్లో జరగనున్న ఈ పరీక్షకు దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలుస్తోంది.