Surekha Vani : మగాళ్ళ బుద్దే అలాంటిది… అందరూ అలాంటి వారే అంటూ సురేఖ వాణి షాకింగ్ కామెంట్స్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సురేఖ వాణి ( Surekha Vani )ఒకరు ఈమె ఒకప్పుడు ఎన్నో సినిమాలలో అక్క పిన్ని రోజున పాత్రలలో నటిస్తూ పెద్ద ఎత్తున పేరు ప్రఖ్యాతలు పొందారు కానీ ఈ మధ్యకాలంలో సురేఖవాణి కాస్త సినిమాలను తగ్గించారనే చెప్పాలి.ఈమె సోషల్ మీడియాలో బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమాలపై ఫోకస్ తగ్గించారా లేకపోతే తనకే సినిమా అవకాశాలు రాలేదా అనేది తెలియదు కానీ సినిమాలు మాత్రం కాస్త తగ్గించారు.

 Actress Surekha Vani Latest Comments Viral On Social Media-TeluguStop.com

ఇక సినిమాలకు దూరంగా ఉంటున్నటువంటి సురేఖ వాణి సోషల్ మీడియాలో( Social media ) మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.సోషల్ మీడియా వేదికగా తన కుమార్తెతో కలిసి ఈమె చేసే డాన్స్ వీడియోలు రీల్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంటాయి.ఇక తరచూ మోడ్రన్ డ్రెస్సులలో కుర్రకారులకు చెమటలు పట్టించేలా సురేఖవాణి నాలుగు పదుల వయసులో కూడా గ్లామర్ షో చేస్తున్నారు.ఇలా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులను సందడి చేస్తూ ఉండే ఈమె డబ్స్మాష్ వీడియోలు కూడా చేస్తూ ఉంటారు.

తాజాగా సురేఖ వాణి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఒక వీడియో వైరల్ గా మారింది ఇందులో భాగంగా మగాళ్ళ బుద్ధి గురించి ఈమె ఒక వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.మగాళ్ళందరూ ఒకటే మనల్ని రీచ్ అయ్యేవరకు ఒకలా ఉంటారు రీచ్ అయిన తర్వాత అందరూ ఒకే లాగా ఉంటారు అంటూ వారి మనస్తత్వం గురించి ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది అయితే ఈ వీడియో పై నెటిజన్స్ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

సురేఖ వాణి ఇలాంటి వీడియో షేర్ చేయడంతో మేడం మిమ్మల్ని ఎవరు రీచ్ అయ్యారు అంటూ కొందరు కామెంట్లు చేయగా.మేడంని ఎవరు బాగా హార్ట్ చేసినట్లు ఉన్నారు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.ఇలా సురేఖ వాణి నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ పాతికేళ్ల పడుచు పిల్లలా తన అందంతో అందరిని ఆకట్టుకుంటూ ఉన్నారు ఇలాంటి తరుణంలోనే ఈమె ఈ వీడియోలను చేయడంతో నేటిజన్స్ విభిన్న రీతిలో ఈమె పై కామెంట్లు చేస్తున్నారు.ఇక సురేఖ వాణి ( Surekha Vani )తన భర్త సురేష్ తేజ చనిపోయిన తర్వాత తన కుమార్తెతో కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే.

ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే.మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాలో ఈమె కూడా భాగమయ్యారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube