ప్రముఖ నటి అనితా చౌదరి కొన్నేళ్ల క్రితం వరకు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నా ఇప్పుడు మాత్రం సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేదు.నువ్వే నువ్వే, ఛత్రపతి, ఉయ్యాల జంపాల మరికొన్ని సినిమాలతో ఈ నటి మంచి పేరును సంపాదించుకున్నారు.
తాజాగా అనితా చౌదరి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కస్తూరి కోసం తొలిప్రేమ సినిమాలో ఛాన్స్ వదులుకున్నానని ఆమె అన్నారు.
కస్తూరి ఫస్ట్ డైలీ సీరియల్ అని అనితా చౌదరి కామెంట్లు చేశారు.
నేను వదులుకున్న మంచి సినిమాలు ఎన్నో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.నేను ఫ్యామిలీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానని అనితా చౌదరి వెల్లడించారు.
మనకు రాసిపెట్టింది మనకే దక్కుతుందని అనితా చౌదరి కామెంట్లు చేయడం గమనార్హం.హీరోయిన్ గా చాలానే అవకాశాలు వచ్చాయని ఆమె తెలిపారు.
కొత్త ప్రాజెక్ట్ లలో చాలా వచ్చాయని అనిత పేర్కొన్నారు.
కొత్త హీరోలు అనే ట్రెండ్ అప్పట్లో ఎక్కువగా లేదని అనితా చౌదరి కామెంట్లు చేశారు.
నాకు మంచి రోల్స్ వచ్చాయని ఆమె అన్నారు.ఇప్పుడు మాత్రం అవకాశాలు ఇవ్వాలని అడుగుతున్నానని అనిత తెలిపారు.
కృష్ణవంశీ గారిని ఛాన్స్ ఇవ్వాలని అడిగానని ఆమె కామెంట్లు చేశారు.నా జీవితంలో అన్ని రోజులు ఉన్నాయని అనితా చౌదరి వెల్లడించారు.
అనితా చౌదరి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
ఏఎన్నార్ గారు నాకు వాళ్ల తోట నుండి జామకాయలు తెప్పించి ఇచ్చేవారని అనిత చెప్పుకొచ్చారు.నాగార్జున గారు టీచర్ అని ఆమె అన్నారు.నాగార్జున గారు నాపై పంచ్ లు వేసేవారని ఆమె కామెంట్లు చేశారు.
బాలయ్య, చిరంజీవి సినిమాలలో ఛాన్స్ రావాలని కోరుకుంటున్నానని, పవన్ సినిమాలో కూడా ఛాన్స్ వస్తే బాగుంటుందని ఆమె అన్నారు.ఈ హీరోల ప్రాజెక్ట్ లలో ఒక్క ఛాన్స్ వస్తే చాలని ఆమె అన్నారు.