వాళ్ల పాలిట దేవతలా మారిన షకీలా.. ఏం జరిగిందంటే..?

మలయాళ ఇండస్ట్రీలో ఎక్కువగా సినిమాలు చేసి శృంగార తారగా ఒక వెలుగు వెలిగిన షకీలా ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎక్కువగా నటించడం లేదనే సంగతి తెలిసిందే.

ఆర్థికంగా షకీలా స్థిరపడకపోయినప్పటికీ కరోనా కష్టాల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్లకు షకీలా తన వంతు సహాయం చేస్తూ వార్తల్లో నిలిచారు.

నిరుపేదల కడుపు నింపుతూ షకీలా మానవత్వాన్ని చాటుకుంటూ ఉండటం గమనార్హం.చెన్నైలో ఆకలితో అలమటిస్తున్న వాళ్లకు షకీలా అన్నం పెట్టి కడుపు నింపారు.

నిరుపేదల పాలిట షకీలా దేవతలా మారారు.దాతృత్వాన్ని చాటుకున్న షకీలాకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తూ ఉండటం గమనార్హం.

సోషల్ మీడియాలో షకీలా ఫోటోలను పోస్ట్ చేయడంతో పాటు రెండు చేతులలో ఒక చేతిని మీకోసం మరో చేతిని ఇతరుల కోసం ఉపయోగించాలని ఆమె కోరారు.

Advertisement

పేదలకు చేతనైనంత సహాయం చేయాలని షకీలా పిలుపునివ్వడం గమనార్హం.కర్ఫ్యూ, లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉండటం వల్ల ఆకలితో అలమటిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.షకీలా కుక్ విత్ క్లౌన్ అనే షో చేస్తుండగా ఆ షోకు ప్రేక్షకాదారణ బాగానే ఉంది.

షకీలా సామాజిక సేవలో పాల్గొనగా ఆమెలా మరి కొందరు సెలబ్రిటీలు ముందుకు రావాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.తాము కూడా షకీలాలా పేదలను ఆదుకుంటామంటూ మరి కొందరు పోస్టులు పెడుతున్నారు.

ఇప్పటికే సోనూసూద్ ఎంతోమంది పేదలను ఆదుకుంటూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.సోనూసూద్ లా మరి కొంతమంది సెలబ్రిటీలు కూడా మానవత్వాన్ని చాటుకుంటూ సామాజిక సేవ చేస్తున్నారు.అయితే కొంతమంది సెలబ్రిటీలు తమ వంతు సహాయం చేస్తున్నా ఆ సహాయాన్ని చెప్పుకోవడానికి మాత్రం ఇష్టపడటం లేదు.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు