అక్కినేని నాగార్జున కోడలు సమంత పెళ్లికి ముందు సినిమా ఆఫర్లతో ఎంత బిజీగా ఉన్నారో పెళ్లి తర్వాత కూడా అదే స్థాయిలో బిజీగా ఉండటం గమనార్హం.చెన్నైలో పుట్టిపెరిగిన సమంత తమిళంతో పోలిస్తే తెలుగులోనే నటిగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం పూర్తిగా హైదరాబాద్ కే పరిమితమైన సమంత లైఫ్ లో తనకు ఇష్టమైన రెండు అంశాలను మిస్సయ్యానని చెబుతుండటం గమనార్హం.
తన ఇన్ని సంవత్సరాల జీవితంలో రెండింటినీ మాత్రమే మిస్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ లో సెటిలైన తర్వాత సాగరతీరాలను మిస్ అయ్యానని సమంత పేర్కొన్నారు.చెన్నై బీచ్ తన లైఫ్ లో ఒక భాగమని చెన్నై బీచ్ లో ఫోటో షూట్ లు, స్నేహితులతో షికార్లు, ఎన్నో పుట్టినరోజు వేడుకలు జరిగాయని ఆమె చెప్పుకొచ్చారు.
అయితే హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఆ బీచ్ ను మిస్ అవుతున్నానని సమంత పేర్కొన్నారు.

చెన్నై బ్రేక్ ఫాస్ట్ ను కూడా తాను మిస్ అవుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు.తనకు బాల్యం నుంచి చెన్నైలో బ్రేక్ ఫాస్ట్ చేయడం అలవాటని హైదరాబాద్ లో సెటిల్ అయిన తరువాత చెన్నై బ్రేక్ ఫాస్ట్ లను తాను మిస్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె చెప్పుకొచ్చారు.చెన్నై నుంచి ఈ రెండింటినీ మాత్రమే తాను కోల్పోయానని అంతకు మించి మరేం కోల్పోలేదని ఆమె వెల్లడించారు.