బిగ్ బాస్ షో తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా మంచి పాపులారిటీని దక్కించుకుంది.ఇకపోతే ప్రస్తుతం హిందీలో బిగ్ బాస్ సీజన్ 16 నడుస్తోంది.
ఈ షో కి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.ఇది ఇలా ఉంటే ఈ బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ ను కంటెస్టెంట్ గా తీసుకురావడం అన్నది ఇప్పుడు బిగ్ బాస్ కి పెద్ద తలనొప్పిగా మారింది.
సాజిద్ ఖాన్ నీ హౌస్ నుంచి తరిమిస్తారా లేదా అంటూ సెలబ్రిటీలు ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు.అందుకు గల కారణం కూడా లేకపోలేదు.
ఎందుకంటే గతంలో మీ టు ఉద్యమం జరిగిన సమయంలో సాజిద్ ఖాన్ పై పలువురు మహిళలు లైంగిక ఆరోపణలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే.
అటువంటి వ్యక్తిని బిగ్ బాస్ హౌస్ లోకి ఎలా రానిస్తారు అంటూ బాలీవుడ్ సినీ వర్గాలలో పలువురు సెలబ్రిటీలతోపాటు ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ విషయంపై సీరియల్ నటి కనిష్క సోనీ స్పందించింది.దర్శకుడు సాజిద్ ఖాన్ విషయంలో తాను ఎదుర్కొన్న ఒక చేదు సంఘటన గురించి మరొకసారి బయట పెట్టేసింది.2008లో సాజిద్ ఖాన్ తన సినిమాలో అవకాశం ఇచ్చినందుకు గాను తనని రూమ్ కి పిలిచి టాప్ తీసేసి నడుము చూపించమన్నాడు అంటూ ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని మరొకసారి గుర్తు చేసింది.గతంలో అతని పేరు చెప్పడానికి భయపడ్డానని కానీ ఇప్పుడు అతడు బిగ్ బాస్ హౌస్ లో ఉండడాన్ని ప్రతి ఒక్కరు తప్పు పడుతున్నారు.

తోటి స్నేహితులు కూడా అతన్ని హౌస్ నుంచి వెళ్లగొట్టాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ విషయాన్ని బయట పెట్టాను అని తెలిపింది కనిష్క సోనీ.అలాగే నాకు అవకాశం ఇవ్వడం కోసం అతడు నన్ను ఏమేమి అడిగాడో చెప్పాలి అంటే భయంగా ఉంది.ఎందుకంటే అటువంటి సెలబ్రిటీలు ఏ సమయంలో అయినా నన్ను చంపేయవచ్చు.ప్రభుత్వాలు చట్టాల మీద నాకు నమ్మకం లేదు.కానీ దేవుడి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది.అలాగే నేను వారితో చేసే పోరాటానికి అందరూ కలిసి సమాధానం ఇస్తారన్న నమ్మకం నాకు ఉంది అంటూ ఆవేదనను వ్యక్తం చేసింది కనిష్క సోనీ.