నటి ప్రణీత గత ఏడాది తన చిన్ననాటి స్నేహితుడు ప్రముఖ వ్యాపార వేత్త నితిన్ రాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని తన పెళ్లి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ప్రణీత తల్లి కాబోతున్న విషయాన్ని తన భర్త పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు.
ఈ క్రమంలోనే అప్పటి నుంచి నిత్యం తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.
తన ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పటి నుంచి ప్రతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ పౌష్టికాహారం ఎక్సర్సైజులు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి ప్రణీత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన ప్రెగ్నెన్సీ గురించి తనకి కలిగే అనుభూతిని అభిమానులతో పంచుకున్నారు.
ఇకపోతే తాజాగా ఈమె బేబీ బంప్ ఫోటో షూట్ జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇకపోతే ప్రణీత ప్రస్తుతం చివరిదశ ప్రెగ్నెన్సీ స్టేజ్ లో ఉన్నారు.మరి కొద్ది రోజులలోనే ఈమె ఒక పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.ఈ పోస్ట్ లో భాగంగా ప్రతి పౌండ్ బరువు, సాగిన చర్మం గుర్తు, నా గుమ్మడికాయ ముఖం, పెద్ద ముక్కు, ఆ కటి నొప్పి.
గుండె బరువెక్కిపోవడం, అలసటగా మారి పోవడం వంటివి విలువైన వాటిని నాకు నేనే చెప్పుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా ఈమె తన ప్రెగ్నెన్సీ గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.