శశికిరణ్ తిక్క దర్శకత్వంలో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్.ఈ సినిమాలో అడవి శేష్ ప్రధాన పాత్రలో నటించారు.
ముంబై దాడులలో టెర్రర్ ఘాతుకానికి ఎంతో మంది జవాన్లు బలయ్యారు.ఈ క్రమంలోనే మేజర్ సందీప్ చివరి వరకు దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందారు.
ఇక ఈయన బయోపిక్ చిత్రంగా తెరకెక్కిన మేజర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇకపోతే ఈ సినిమా దేశవ్యాప్తంగా పలు నగరాలలో ప్రీవ్యూ షో ద్వారా ప్రదర్శించిన సంగతి మనకు తెలిసిందే.
ఇటీవల ముంబైలోని 312 మంది కమాండోలు, వారి కుటుంబ సభ్యుల కోసం కూడా స్పెషల్ షోను ప్రదర్శించారు.వారి నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా పూర్తయిన తర్వాత అక్కడ నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది.ఈ క్రమంలోనే తనని హెడ్ క్వార్టర్స్కి రమ్మని చెప్పారు.
అక్కడికి వెళ్లగానే వారు తనకు బ్లాక్ క్యాట్ కమాండోస్ తరపున మెడల్ తో సత్కరించారు. ఈ మేడల్ తనకు ఆస్కార్ అవార్డు కన్నా ఎంతో విలువైనది అంటూ అడివి శేష్ ఈ సందర్భంగా ఆ మెడల్ గురించి తెలియజేశారు.

ఈ సినిమా దేశంలోని పలు నగరాలలో ఏకంగా 88 ప్రీమియర్ షోలు ప్రదర్శించింది.88 ప్రీమియర్ షోలలో కూడా ఈ సినిమా హౌస్ ఫుల్ కావడం గమనార్హం.ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల అయ్యి అద్భుతమైన హిట్ టాక్ సొంతం చేసుకుంది.ఇకపోతే తాజాగా మేజర్ సందీప్ తల్లిదండ్రులు కూడా ఈ సినిమా చూసి తన దుఃఖాన్ని దూరం చేసుకున్నామని ఎమోషనల్ కామెంట్ చేశారు.







