గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్ ను ద‌త్త‌త తీసుకున్న హీరోయిన్.! గ్రామాలను దత్తత తీసుకున్న మరికొంతమంది సెలబ్రిటీల వివరాలు..

ఊరు మనకు చాలా ఇచ్చింది.తిరగిచ్చేయకపోతే లావైపోతాం.

శ్రీమంతుడు సినిమాలో ఈ డైలాగ్ ఎంత ఫేమస్సో మనకు తెలిసిందే.

ఆ సినిమాలో గ్రామాన్ని దత్తత తీసుకుని దాన్ని అభివృద్ది చేసే క్యారెక్టర్ పోషించారు నటుడు మహేశ్ బాబు.

ఆ సినిమాకు ముందు కూడా కొందరు సెలబ్రిటీలు గ్రామాలను దత్తత తీస్కున్నప్పటికి,ఆ సినిమా తర్వాత సినిమా తారలు ఎక్కువగా ఈ విషయం వైపు దృష్టి సారించారు.తాజాగా తెలుగు హీరోయిన ప్ర‌ణీత కర్ణాటక లోని ఆలూర్ అనే గ్రామంలోఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ను ద‌త్త‌త తీసుకుంది.

ద‌త్త‌త కార్య‌క్ర‌మం అయిన వెంట‌నే ఓ 5 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఆ స్కూల్ అంద‌జేసి ఫ‌స్ట్ బాలిక‌ల‌కు మూత్ర‌శాల‌లను ఏర్పాటు చేయాల‌ని స్కూల్ హెడ్ మాస్ట‌ర్ ను కోరింది.విద్యార్థుల అభివృద్దికి త‌న వంతు స‌హాయ స‌హ‌కారాల‌ను అందిస్తాన‌ని పేర్కొంది.

Advertisement

చాల మంది సెలేబ్రిటిలు మన దేశంలోని కొన్ని గ్రామాలను దత్తతు తీసుకున్నారు.త‌మ‌కు తెలిసిన, త‌మ మూలాలున్న గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకొని వాటి అభివృద్దికి స‌హాయ‌ప‌డుతూనే ఉన్నారు.వారి వివరాలు,ఆ గ్రామాల వివరాలు చూద్దాం.

మ‌హేష్ బాబు : సిద్దాపురం ( తెలంగాణ ) & బుర్రిపాలెం ( ఆంద్ర ప్ర‌దేశ్ ).బుర్రిపాలెంలో అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేసినంత‌గా సిద్దాపురంలో చేయ‌లేదు ప్రిన్స్ .బుర్రిపాలెం గ్రామ అభివృద్ది కార్యక్రమాలను కూడా మహేశ్ భార్య నమ్రత ఎక్కువగా పర్యవేక్షిస్తుంటారు.బుర్రిపాలెం సూపర్ స్టార్ క్రిష్ణ సొంతూరు అనే విషయం మనకందరికి తెలిసేం.

మురళి మోహ‌న్: రంగాపురం ( ఆంద్ర ప్ర‌దేశ్ ).& న‌డిగూడెం ( తెలంగాణ ).రెండు గ్రామాల్లో కూడా ఆశించిన రీతిలో అభివృద్ది కార్య‌క్ర‌మాలేవీ జ‌ర‌గ‌లేదు.

ప్ర‌కాశ్ రాజ్ : కొండ్రెడ్డిప‌ల్లి.( మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా ) 100 ప‌ర్సెంట్ ఎఫ‌ర్ట్ పెట్టి త‌ను ద‌త్త‌త తీసుకున్న గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ది ప‌థంలో న‌డిపిస్తున్నాడీ విల‌క్ష‌ణ న‌టుడు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
నేను ధనవంతురాలిని కాదు....నా దగ్గర సహాయం చేసేంత డబ్బు ఉంది : సాయి పల్లవి

సుమ‌న్ : సుద్ద‌ప‌ల్లి ( మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా) .తెలంగాణ గ్రామ జ్యోతి అనే కార్య‌క్ర‌మంతో స్పూర్తి పొందిన సుమ‌న్ ఇటీవ‌లే సుద్ద‌ప‌ల్లి అనే గ్రామాన్ని ద‌త్త‌త తీసుకున్నాడు.

Advertisement

మంచు విష్ణు : ( చిత్తూరు జిల్లాలోని 5 గ్రామాలు) ఆర్మీ గ్రీన్ ప్రోగ్రామ్ పేరు మీద ….త‌న సొంత జిల్లా చిత్తూరులో విష్ణు 5 గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకున్నాడు.

సచిన్ టెండూల్కర్ : కనీసం బస్టాప్ లేని గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దడానికి నెల్లూరు జిల్లా పుట్టం రాజు వారి పల్లె గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.

తాజా వార్తలు