మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం తెలుగు మలయాళ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి పూర్ణ (Poorna) ఒకరు ఈమె తెలుగులో అవును, సీతామహాలక్ష్మి వంటి సినిమాలలో నటించి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇప్పటికి పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రధాన పాత్రలలో నటిస్తూ పూర్ణ సందడి చేస్తున్నారు.
ఇలా ఒకవైపు వెండితెరపై ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఈటీవీలో ప్రసారమవుతున్నటువంటి ఢీ డాన్స్ షో(Dhee Dance Show) కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

పూర్ణ గత ఏడాది అసిఫ్ అలీ అనే వ్యక్తిని వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.పెళ్లయిన వెంటనే ఈమె గర్భవతి కావడంతో కొంతకాలం పాటు బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.ప్రస్తుతం ఈమె ఒక కుమారుడికి జన్మనిచ్చి తిరిగి బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూనే మరోవైపు సినిమా అవకాశాలను కూడా అందుకుంటే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా స్కూల్ యూనిఫామ్(School Uniform) ధరించి తన స్నేహితులతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
ఇలా స్కూల్ యూనిఫాంలో ఉన్నటువంటి ఈ ఫోటోలను పూర్ణ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ స్కూల్ డేస్ గుర్తుకు వచ్చాయి అంటూ క్యాప్షన్ పెట్టారు.

ఇలా స్కూల్ యూనిఫాంలో ఎంతో క్యూట్గా ఫోటోలకు ఫోజులుఇచ్చినటువంటి పూర్ణ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు ఈమె ఎంత వరకు చదివింది.ఈమెకు క్వాలిఫికేషన్ ఏంటి అనే విషయాల గురించి ఆరా తీస్తున్నారు.మరి పూర్ణ ఎంతవరకు చదివిందనే విషయానికి వస్తే.1989 మే 23న జన్మించింది.ఇక కేరళలోని( Kerala ) కన్నూరులోనే తన స్కూలింగ్ పూర్తి చేసింది.
ఉర్సులైన్ సీనియర్ సెకండరీ స్కూల్, సెయింట్ థెరెసాస్ ఆంగ్లో ఇండియన్ హైయర్ సెకండీ స్కూల్ లో చదువుకుంది.ఆ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ విభాగంలో ఇంగ్లీష్ నుంచి ఈమె పట్టా కూడా పొందారు.
అయితే అప్పటికే ఈమెకు సినిమాలలో అవకాశాలు రావడంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.