చాలా మంది హీరోలుగా తమని తాము మరింత బెటర్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సొంతగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి నిర్మాతగా కూడా మారుతారు.పెద్ద హీరోలు రెమ్యునరేషన్ తీసుకోకుండా నిర్మాణ భాగస్వామిగా ఉంటూ లాభాల్లో వాటాలు తీసుకుంటారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు.ఇప్పుడు ఇదే పంథాని చాలా మంది హీరోలు అమలు చేస్తున్నారు.
ఇక కళ్యాణ్ రామ్ కూడా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి నిర్మాతగా మారాడు.విశాల్ కూడా అలాగే తన సినిమాలన్నీ కూడా తన హోం బ్యానర్ లోనే నిర్మిస్తున్నాడు.
మంచు ఫ్యామిలీ హీరోలు కూడా హోం బ్యానర్స్ పెట్టుకొని సినిమాలు చేస్తున్నారు.ఇక నాగ్ అశ్విన్ కూడా సొంతగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి తానే హీరోగా సినిమాలని నిర్మిస్తున్నాడు.
కొత్త కథలని ఎంచుకుంటూ కమర్షియల్ హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు.
అయితే హీరోలు నిర్మాతలుగా మారినంత ఈజీగా హీరోయిన్స్ మారరు.
వారికొచ్చిన రెమ్యునరేషన్ ని ఇతర వ్యాపారాలలో పెట్టి కొత్త బిజినెస్ లు చేసుకుంటారు.అయితే అవికాగోర్ రీఎంట్రీ తర్వాత సొంతగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి తానే హీరోయిన్ గా సినిమాలు నిర్మిస్తుంది.
అలాగే హీరోయిన్ గా ఎదగాలని ముంబై నుంచి వచ్చిన ఓ అందాల భామ అవకాశాల కోసం ప్రయత్నం చేసి సాధ్యం కాక తానే నిర్మాతగా మారి హీరోయిన్ గా పరిచయం అవుతుంది.తాను కష్టపడి సంపాదించిన సొమ్ముతో బాయ్స్ అనే సినిమాని నిర్మించడంతో పాటు అందులో మెయిన్ హీరోయిన్ గా నటించింది.
మరి ఈ ఆమె పేరు మిత్రశర్మ.తనలాంటి ప్రతిభావంతులని ప్రోత్సహించడంతో తెరపై తనని తాను హీరోయిన్ గా చూసుకోవడానికి యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా బాయ్స్ సినిమాని నిర్మించింది.ఈ మూవీతో దయానంద్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.మరి ఈ ముంబై బ్యూటీ ప్రయత్నం టాలీవుడ్ లో ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది వేచి చూడాలి.