ప్రముఖ టాలీవుడ్ నటి మధుమణి( Actress Madhumani ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో, ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ఈ నటి సత్తా చాటారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మధుమణి మాట్లాడుతూ చిరంజీవి గారి నాలుగు సినిమాలలో ఛాన్స్ వచ్చి మిస్ చేసుకున్నానని ఆమె తెలిపారు.ఓజీ సినిమాలో ఛాన్స్ వచ్చిందని కానీ నా కూతురు డెలివరీ వల్ల ఆ మూవీ ఆఫర్ ను సైతం నేను వదులుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.
నా కూతురు ఓజీ సినిమా( OG Movie )లో యాక్ట్ చేయాలని కోరిందని కానీ నేను అందుకు సంబంధించి అంగీకరించలేదని మధుమణి వెల్లడించారు.హిట్లర్ సినిమాలో ఒక చెల్లెలి పాత్ర కోసం నేను సెలెక్ట్ అయ్యానని ఆ సమయంలో తిరుమలకు వెళ్లానని డేట్స్ మారడంతో ఆ సినిమాలో ఛాన్స్ పోయిందని మధుమణి పేర్కొన్నారు.బావగారూ బాగున్నారా సినిమాలో రంభ ఫ్రెండ్ రోల్ చేయాలని కోరగా నేను వదులుకున్నానని ఆమె తెలిపారు.
భోళా శంకర్ మూవీ( Bhola Shankar ) కూడా అమెరికాలో ఉండటం వల్ల వదులుకున్నానని మధుమణి కామెంట్లు చేశారు.పవన్ గోకులంలో సీత సినిమాలో ఛాన్స్ కూడా మిస్ అయ్యానని మధుమణి అన్నారు.నేను అందరికీ తెలుసని అయితే పేరు చెబితే అందరికీ గుర్తు రానని ఆమె పేర్కొన్నారు.
అడిషన్ అడిగితే ఇవ్వనని నేను చెప్పనని మధుమణి కామెంట్లు చేశారు.నేను గూగుల్ పే కూడా పెద్దగా వాడలేనని ఆమె అన్నారు.
ఎవరైనా డబ్బులు అడిగితే డబ్బుకు బదులుగా పని ఇస్తానని చెబుతానని మధుమణి అన్నారు.మా అమ్మకు థ్యాంక్స్ అని ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచారని ఆమె తెలిపారు.
నా కూతురు వెళ్లిపోవడంతో మహాలక్ష్మి వెళ్లిపోయిందని అనిపిస్తుందని ఆమె కామెంట్లు చేశారు.