ఘనంగా ఐలమ్మ జయంతి వేడుక

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం చాకలి ఐలమ్మ ( chakali Ailamma )128వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా మండల రజక సంఘం అధ్యక్షులు కంచర్ల నర్సింలు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె చేసిన పోరాటాల గురించి వివరించారు.

 Celebrating Chakali Ailamma Birth Anniversary , Chakali Ailamma , Birth Anniv-TeluguStop.com

ఆనాటి కాలంలోనే పోరాటం చేసిన గొప్ప వీర వనిత అని అన్నారు.ప్రభుత్వం రవీంద్రభారతిలో అధికారికంగా అయిలమ్మ జయంతి వేడుకలు నిర్వహించడం సంతోషకరమన్నారు.

కానీ ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజక సంఘం కార్యదర్శి బాలమల్లు,మండల రజక సంఘం గౌరవ సలహాదారు దొమ్మాటి నరసయ్య, నాయకులు అజయ్,రాజు, చంద్రయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube