ఆ రీజన్ వల్లే సినిమాలకు దూరమయ్యా.. లయ సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ ప్రముఖ నటీమణులలో ఒకరైన లయ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో అరవింద సమేత వీర రాఘవ సినిమాలో నటించే అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని లయ వదులుకోవడం జరిగింది.

తాజాగా లయ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.స్వయంవరం అనే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా లయ కెరీర్ మొదలైంది.తొలి సినిమాకే నంది అవార్డ్ గెలుచుకున్న ఈ నటి ఆ తర్వాత ప్రేమించు, మనోహరం సినిమాలకు సైతం నంది అవార్డ్ ను సొంతం చేసుకున్నారు.13 సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా లయ ఒక వెలుగు వెలిగారు.పలువురు స్టార్ హీరోలకు సైతం ఈ నటి జోడీగా నటించడం జరిగింది.

లయ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ ఫ్యాన్స్ కు దగ్గరవుతున్నారు.

కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే నాకు మంచి పెళ్లి సంబంధం వచ్చిందని ఆమె కామెంట్ చేశారు.నా భర్త సినిమాలు చేయవద్దని ఎప్పుడూ చెప్పలేదని ఆమె వెల్లడించారు.కానీ ఎందుకో సినిమాలకు దూరం కావడం జరిగిందని లయ అన్నారు.

Advertisement

ఇప్పటికీ నా రీల్స్, ఫోటోలను ఆయనే తీస్తాడని లయ కామెంట్ చేశారు.నా భర్త నన్ను అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాడని ఆమె చెప్పుకొచ్చారు.

నా భర్త లేకుండా నేనేం చేయలేనని ఆమె కామెంట్ చేశారు.కష్టపడి ఇండస్ట్రీలో ఒక స్థాయికి చేరుకున్న తర్వాత అన్నీ వదిలేసుకుని వెళ్లడం సులువు కాదని లయ పేర్కొన్నారు.సినిమాలను, ఫ్యామిలీని నేను బ్యాలెన్స్ చేసుకోగలనని ఆమె కామెంట్లు చేశారు.

నా భర్త అమెరికాలో ఉండటం వల్ల దూరం పెరిగిందని లయ చెప్పుకొచ్చారు.ఇండియాకు యూఎస్ కు ట్రావెల్ చేయడం సులువు కాదని అందువల్లే నేను సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందని లయ అన్నారు.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు