స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయిన వేణు మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ లో అందరి అటెన్షన్ ని తన వైపు తిప్పుకున్నాడు.అలాగే ఆ సినిమా తరువాత చిరునవ్వుతో సినిమాతో ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.

ఆయన చేసిన స్వయంవరం చిరునవ్వుతో రెండు సినిమాలకి కూడా త్రివిక్రమ్ గారే రైటర్ కావడం విశేషం…అలా వేణు రెండు సక్సెస్ లు బ్యాక్ టూ బ్యాక్ సాధించడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి ఆయన చేసిన ప్రతి సినిమాలో కామెడీ కి పెద్ద ప్రాధాన్యత ఉంటుంది…అలాగే ఆయన ఎక్కువ గా మల్టీ స్టారర్ సినిమాల్లో కూడా నటించారు.శ్రీకాంత్, జగపతిబాబు, అర్జున్, అల్లరి నరేష్ వంటి హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు… అప్పటి వరకు అలా చాలా రోజులపాటు సక్సెస్ఫుల్ గా సాగిన వేణు కెరియర్, ఆ తరువాత చేసిన కొన్ని సిన్మలు ప్లాప్ అవ్వడంతో ఆయనకి హీరో గా అవకాశాలు తగ్గాయి దాంతో ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయాడు.

ఇక ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం వేణు రవితేజ హీరో గా చేసిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో ఒక కీలక పాత్ర లో నటించి తన సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు.ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది కానీ వేణు క్యారెక్టర్ కి మాత్రం మంచి పేరు వచ్చింది.ప్రస్తుతం వేణు కొన్ని వెబ్ సిరీస్ లతో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నాడు…ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ అయిన ఏ ఆటకం లేకుండా సాఫీగా సాగిపోవాలని కోరుకుందాం…








