తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు బాలకృష్ణ ఒకరు.అయితే బాలకృష్ణ గురించి ఇప్పటికే ఎంతో మంది మాట్లాడుతూ బాలయ్యకు చాలా కోపం ఎక్కువ అంటూ మాట్లాడుతూ ఉంటారు.
అయితే ఈ మాటలన్నీ కూడా ఆయనతో కలిసి పని చేయని వారు మాత్రమే మాట్లాడతారు.ఒకసారి తనతో కలిసి పనిచేస్తే బాలకృష్ణ వ్యక్తిత్వం ఆయన మనసు ఎలాంటిదో అందరికీ అర్థమవుతుందని ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు బాలయ్య మంచి మనసు గురించి తెలిపారు.

ఈ క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటి లయ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని బాలకృష్ణ గారి గురించి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.బాలకృష్ణ గారితో తనకు చెన్నకేశవరెడ్డి సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల నటించలేకపోయానని తెలిపారు.అయితే విజయేంద్ర వర్మ సినిమాలో తిరిగి బాలకృష్ణ గారితో కలిసి నటించే అవకాశం వచ్చిందని తెలిపారు.ఈ సినిమాలో బాలకృష్ణ గారితో కలిసి ఒక సాంగ్ చేయాల్సి ఉండగా ఈ సాంగ్ కి రిహార్సల్స్ చేస్తున్నామని తెలిపారు.

ఇలా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో నా వెనుక బాలకృష్ణ గారు ఉండడం తాను చూసుకోలేదని అయితే పొరపాటున తన కాలు తొక్కానని తెలిపారు.ఒకసారిగా వెను తిరిగి చూడగా బాలకృష్ణ గారు ఉన్నారని అయ్యో సార్ చూసుకోలేదు క్షమించండి అని ఆయనకు క్షమాపణలు చెప్పినా వెంటనే బాలయ్య మాత్రం ప్యాకప్ అంటూ ఆరోజు షూటింగ్ కు ప్యాకప్ చెప్పారని ఈమె తెలియజేశారు.బాలకృష్ణ గారికి కాస్త కోపం ఎక్కువ అని నేను విన్నాను అలాగే నావల్ల ఈరోజు షూటింగ్ క్యాన్సల్ అయింది అంటూ తాను బాధ పడుతూ ఉండగా అక్కడికి బాలకృష్ణ గారు వచ్చి మరేం బాధపడకు ఏదో సరదాగా అన్నాను అంటూ తనకి మరొక షాక్ ఇచ్చారని తెలిపారు.అప్పటికి నేను భయం భయంగానే ఉండడంతో ఆయన నన్ను నవ్వించడానికి సరదాగా మాట్లాడుతూ జోకులు కూడా వేశారని ఈ సందర్భంగా బాలకృష్ణ వ్యక్తిత్వం ఆయన మంచితనం గురించి నటి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







