జనగామ జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నారు.జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలలో చిన్నారులతో పాటు పలువురిపై శునకాలు దాడి చేశాయని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే నాలుగు కాలనీలలో జనాలపై వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి.ఈ దాడిలో ఓ చిన్నారికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
అయితే కుక్కల బెడదపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో అధికారులు ఇప్పటికైనా స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.







