రజినీకాంత్ పై వివాదాస్పద నటి సెటైర్.. ఆలాంటి వాళ్ళు ఆగిపోవడం బెటర్ అంట

తమిళనాడు రాజకీయాలలో రజినీకాంత్ రాజకీయ పార్టీకి సంబందించిన వరుస సంఘటనలు ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయాయి.ఈ నెల ఆరంభంలో రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు.

డిసెంబర్ ఆఖరున పార్టీ పేరు ప్రకటిస్తా అని జనవరి నుంచి పూర్తి స్థాయి రాజకీయ కార్యకలాపాలలో దిగాబోతున్నట్లు సూపర్ స్టార్ రజిని ప్రకటించారు.తరువాత అన్నాత్తై సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చేశారు.

కొద్ది రోజులు షూటింగ్ జరిగిన తర్వాత షూటింగ్ సెట్ లో ఎనిమిది మందికి కరోనా రావడంతో సినిమా షూటింగ్ అర్ధంతరంగా వాయిదా వేసేశారు.ఇక రజినీకాంత్ చెన్నై వెళ్దామని బయలుదేరే లోపే ఆరోగ్యం దెబ్బ తినడంతో హాస్పిటల్ లో చేరారు.

తరువాత హైబీపీ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.అయితే ఈ సమయంలో వీలలంత రిలాక్స్ గా ఉండాలని, ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదని, అలాగే విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.

Advertisement

దీంతో చెన్నై వెళ్ళిన తర్వాత ఇంట్లో కూడా రజినీకాంత్ రాజకీయ ఎంట్రీపై అతని కూతుళ్ళు ఒత్తిడి తెచ్చి విరమించుకోవాలని సూచించారు.

ఇక అన్ని ఆలోచించిన తర్వత రాజకీయాలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న రజినీకాంత్ తన నిర్ణయాన్ని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.అలాగే రాజకీయాలపై అభిమానులకి ఆశ కల్పించునందుకు క్షమించాలని కోరారు.ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి శాశ్వతంగా రాజకీయాలకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అయితే రజినీకాంత్ నిర్ణయాన్ని అందరూ స్వాగతించిన కొంత మంది మాత్రం వ్యతిరేకించారు.తాజాగా వివాదాస్పద నటి కస్తూరి రజిని నిర్ణయాన్ని స్వాగతిస్తూనే సున్నితంగా విమర్శలు కూడా చేశారు.

ఇది ఊహించిన‌దే.ఇప్పుడు కాదు ఇంకెప్పుడు అని ట్వీట్ చేశారు.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

ఈ విషయం నేను ముందుగానే గ్రహించాను.ఈ విష‌యం రజనీకాంత్ ముందే చెప్పి ఉంటే కొన్ని సంవ‌త్స‌రాలుగా ఎంతోమంది బాధ తొలిగిపోయేది.

Advertisement

మొత్తానికి ఆయ‌న ఇప్పుడు చెప్పేశారు.కోట్లు పోగొట్టుకోవ‌డం కంటే.

మెద‌డు ప‌డే ఆవేద‌న చాలా పెద్ద‌ది.భ‌య‌పడే వారు వ‌ల‌న బాధ‌ప‌డేవారు ఉంటే యుద్ధానికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిదని ఆమె అన్నారు .

తాజా వార్తలు