సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో నెటిజన్స్ ఏదో ఒక సెలబ్రిటీపై ట్రోలింగ్స్ చేస్తూనే ఉంటారు.చిన్న హీరోల నుంచి పెద్ద హీరో హీరోయిన్ ల వరకు ప్రతి ఒక్కరిపై ఏదో ఒక సమయంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరుగుతూనే ఉంటాయి.
కొన్ని రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ పై ట్రోల్స్ జరిగిన విషయం తెలిసిందే.ఆర్ఆర్ఆర్ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అక్కడి స్లాంగ్‌లో, అమెరికా యాసలో మాట్లాడడంతో ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇక జూనియర్ అమెరికన్ యాక్సెంట్ చూసి అక్కడి మీడియా ప్రతినిధి సైతం ఆశ్చర్యపోయారు.

జూనియర్ యాక్సెంట్‌పై విదేశీయులు ప్రశంసలు కురిపించగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి.రెండు మూడు రోజులు దీనిపై భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.ఇక తాజాగా ఈ వివాదంపై నటి కస్తూరి శంకర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి కస్తూరి శంకర్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.అమెరికా వాళ్లకి వాళ్ల స్లాంగ్ లోనే మాట్లాడితేనే అర్థమవుతుంది.మన ఇంగ్లీష్‌లో మాట్లాడితే వారికి అర్థం కాదు.
అందుకే ఎన్టీఆర్ అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడారు.ఆ విషయంలో ఎన్టీఆర్ చేసింది కరెక్ట్.
కానీ మన దగ్గర మాత్రం చాలా మంది ఎన్టీఆర్ ది ఫేక్ యాక్సెంట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

అది చాలా తప్పు.ఎందుకంటె నేను కూడా అమెరికాలో ఉన్నాను.అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలుసు.
అమెరికా వాళ్లకి వాళ్లలాగా మాట్లాడితే అర్థమవుతుంది.నేను ఇక్కడ తెలుగులో నా తమిళ యాక్సెంట్‌లో మాట్లాడితే అర్థమవుతుందా, అర్థం కాదు కదా అని చెబుతూనే ఎన్టీఆర్ పై ట్రోల్స్ చేసేవారిపై మండిపడింది.
ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మీ గురించి కూడా మాట్లాడుతూ.నిజమైన ప్రయత్నానికి కావాలని చేసే ఫేక్ ప్రయత్నానికి తేడా ఉంది కదా.హైదరాబాద్‌కి వచ్చి అలాంటి స్లాంగ్‌లో మాట్లాడితే కచ్చితంగా ట్రోల్ చేస్తారని చెప్పింది.ఇక్కడ తెలుగే మాట్లాడొచ్చు కదా, తెలుగు కూడా అమెరికన్ యాక్సెంట్‌లో మాట్లాడటం ఎందుకు అంటూ మంచు లక్ష్మికి పరోక్షంగా చురకలంటించింది కస్తూరి.
అంతే కాకుండా ఈ విషయంలో ఎన్టీఆర్‌ని, మంచు లక్ష్మితో పోల్చొద్దని సూచించింది కస్తూరి.







