జనగామ జిల్లా గిర్నితండాలో మెడికో ప్రీతి అంత్యక్రియలు జరగనున్నాయి.ప్రీతి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తుంది.
దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
మరోవైపు గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.
మృతురాలు ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.ఈ క్రమంలోనే ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.అంతేకాకుండా ప్రీతి మరణానికి కారణమైన దోషులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
అయితే వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజీలో ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.







