సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల గురించి వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు వివాదాలు, వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుంటాయి.ఆ వార్తలలో కొన్ని వార్తలు నమ్మే విధంగా ఉంటే మరికొన్ని వార్తలు మాత్రం నమ్మకశ్యం కాకుండా ఉంటాయి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయచిత్రను( Actress Jayachitra ) పెళ్లి చేసుకున్నారంటూ కొంతకాలం క్రితం వార్తలు జోరుగా ప్రచారంలోకి రావడంతో పాటు ఆ వార్తలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు జయచిత్ర దృష్టికి కూడా రావడంతో తాజాగా ఒక సందర్భంలో వైరల్ అయిన వార్తలు అన్నీ రూమర్లు అని ఆ వార్తలను ఏ మాత్రం పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పుకొచ్చారు.
అలాంటి వార్తల గురించి తాను స్పందించాలని కూడా భావించడం లేదని ఆమె కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ కావడం గమనార్హం.జయచిత్ర క్లారిటితో ఇకనైనా ఈ వార్తలు ఆగుతాయేమో చూడాల్సి ఉంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhar Reddy ) తన జీవిత కాలంలో వివాదాలకు దూరంగా బ్రతికారు.వైఎస్సార్ బ్రతికున్న సమయంలో ఎలాంటి విమర్శలు చేయని వాళ్లు ఆయన చనిపోయిన తర్వాత విమర్శలు చేయడం కరెక్ట్ కాదని వైఎస్సార్ అభిమానులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.జయచిత్ర భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాతో మరో సక్సెస్ దక్కుతుందని ఆమె ఫీలవుతున్నారు.
జయచిత్ర ఈ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకుంటే తెలుగులో మరిన్ని భారీ సినిమాలతో బిజీ అయ్యే అవకాశాలు ఉంటాయి.ఈ జనరేషన్ లో కూడా జయచిత్రను అభిమానించే ఫ్యాన్స్ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.భాషతో సంబంధం లేకుండా జయచిత్ర కెరీర్ పరంగా మరింత సక్సెస్ లను అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.జయచిత్ర వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.