ఎంతో టాలెంట్ ఉన్న ఇంద్రజకు సినిమాలలో గ్యాప్ రావడానికి కారణమేంటో మీకు తెలుసా?

తెలుగు, మలయాళ సినిమాల ద్వారా ఇండస్ట్రీలో ఇంద్రజ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.

ఇంద్రజ తన సినీ కెరీర్ లో 80కు పైగా సినిమాలలో నటించడం గమనార్హం.

ఇంద్రజ నటిగానే ప్రేక్షకులకు సుపరిచితమైనా ఈమె మంచి సింగర్ కావడం గమనార్హం.జంతర్ మంతర్ సినిమా ఇంద్రజ నటించిన తొలి సినిమా కాగా ఈమె నటించిన యమలీల సినిమా మొదట విడుదలైంది.

మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు జోడీగా ఇంద్రజ నటించడం గమనార్హం.రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కి త్వరలో విడుదలవుతున్న స్టాండప్ రాహుల్ సినిమాలో ఇంద్రజ కీలక పాత్రలో నటించారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన ఇంద్రజ డైరెక్టర్ ఫోన్ లో ఈ సినిమా స్టోరీ తనకు చెప్పాడని ఈ కథ తనకు కొత్తగా అనిపించిందని అన్నారు.మురళీశర్మ ఈ సినిమాలో తన భర్త రోల్ లో నటించారని ఆమె అన్నారు.

Advertisement

ఈ సినిమా క్లైమాక్స్ చాలా బాగుంటుందని ఆమె వెల్లడించారు.సినిమాలలో గ్యాప్ రావడం గురించి ఇంద్రజ స్పందిస్తూ సరైన పాత్రలు రాకపోవడం వల్ల కొన్ని సినిమాల్లో తాను నటించడానికి ఆసక్తి చూపించలేదని చెప్పుకొచ్చారు.

మహిళలకు సరైన సపోర్టింగ్ రోల్స్ రావడం లేదని అందుకే సినిమాల విషయంలో తనకు గ్యాప్ వచ్చిందని ఆమె వెల్లడించారు.స్టాండప్ రాహుల్ సినిమాలో ఈ జనరేషన్ కు అర్థమయ్యేలా దర్శకుడు చాలా విషయాలను ప్రస్తావించాడని ఆమె అన్నారు.

కొత్తగా తాను మూడు సినిమాలలో నటించానని ఆమె అన్నారు.నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాతో పాటు ఒక కన్నడ సినిమాలో తాను నటిస్తున్నానని ఆమె తెలిపారు.స్టాండప్ రాహుల్ సినిమాతో రాజ్ తరుణ్ కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.

ఈ మధ్య కాలంలో రాజ్ తరుణ్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు