జీవితంలో ఎవరికైనా కొన్ని సందర్భాలలో ఉన్నప్పుడు ఆ సమయంలో కొన్ని ముఖ్యమైనవి కోల్పోతున్నప్పుడు వచ్చే బాధ మాటల్లో చెప్పలేనిది.ఇలా అందరి జీవితాల్లో కొన్ని సమయాల్లో జరిగే ఉంటాయి.
ఇలాగే తమ జీవితంలో కూడా జరిగాయంటూ నటి శ్రీలక్ష్మి కొన్ని విషయాలు తెలుపుతున్న సమయంలో.ఎం.
ఎస్.నారాయణ కామెడీ సీన్ సమయంలో జరిగిన బాధ గురించి మరో నటి హేమ తెలిపారు.
ఈటీవీ లో ప్రసారమవుతున్న ‘ఆలీతో సరదాగా‘ కార్యక్రమంలో నటీమణులు శ్రీలక్ష్మి, హేమ పాల్గొన్నారు.ఈ సందర్భంలో వాళ్ళ పరిచయాలు, వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్న సమయంలో.నటి శ్రీలక్ష్మి జీవితంలో జరిగిన రెండు విషయాలను పంచుకుంది.తన తమ్ముళ్లు రాజేష్, ఆనంద్ లు మరణించిన సమయంలో.
రాజేష్ చనిపోయేటప్పుడు శ్రీ లక్ష్మీ హైదరాబాద్ లో ‘పెళ్లిసందడి‘ షూటింగ్ లో ఉన్నానని తెలిపింది.ఆ సమయంలో అర్ధరాత్రి చెన్నై నుంచి తన తమ్ముడు చనిపోయాడంటూ ఫోన్ రావడంతో.
మేనేజర్ ను బ్రతిమాలుకొని ఆ రాత్రి చెన్నైకి వెళ్ళిందట.అంతేకాకుండా తన మరో తమ్ముడు ఆనంద్ చనిపోయినప్పుడు ఆమె తమిళ్ సీరియల్ షూటింగ్ లో ఉన్నానని తెలిపింది.
ఆ సమయంలో తన తమ్ముడి కి సీరియస్ గా ఉందని ఫోన్ రాగా.వెంటనే వెళ్లాలని డైరెక్టర్ ను కోరిందట.
కానీ ఆయన కొన్ని సీన్లు ఉన్నాయని చేసి వెళ్లండి అని తెలుపగా ఏం చేయలేని పరిస్థితిలో లోపల బాధ మింగు కొని నటించానని తెలిపింది.కానీ ఆమె వెళ్లేసరికి తను తమ్ముడు అప్పటికే చనిపోయాడని ఏడుస్తూ చెప్పింది శ్రీలక్ష్మి.

దీంతో అదే సమయంలో నటి హేమ ఎమ్.ఎస్.నారాయణ జీవితంలో జరిగిన సంఘటనను తెలపగా.తనకు ఎమ్.ఎస్.నారాయణ ఒక విషయాన్ని చెప్పాడట.దూకుడు సినిమాలో కళ్ల కింద క్యారీబ్యాగ్ సీన్ చేస్తున్న సమయంలో.తన భార్యకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని, ఆయన సంతకం పెడితే కానీ సర్జరీ చేయాలని అపోలో హాస్పిటల్ నుండి పిలుపు వచ్చిందని తెలిపింది.
కానీ ఆ సమయంలో ఆయన రామోజీ ఫిలిం సిటీ లో ఉన్నప్పటికీ హాస్పిటల్ కి వెళ్లడానికి కుదరక పోయేసరికి.వెంటనే ఆ లెటర్ ను అక్కడికి తెప్పించుకొని సంతకం చేశారని తెలిపింది.
కానీ ఆయన చేసే సీన్ నవ్వుతూ కామెడీ చేయడంతో.ఆ సీన్ అయిపోయాక బాత్రూంలోకి వెళ్లి బాగా ఏడ్చారని, మళ్లీ కళ్ళు కడుక్కొని షూటింగ్ లో నటించాడని తెలిసింది.