నువ్వు నేను, శ్రీరామ్ మరికొన్ని సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న అనిత( Anita Hassanandani ) ప్రస్తుతం తెలుగులో రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.గతంలో 76 కిలోల బరువు ఉన్న అనిత ఏకంగా 18 కిలోల బరువు తగ్గారు.
ప్రస్తుతం ఆమె బరువు 58 కిలోలు( 58Kgs ) కావడం గమనార్హం.తన బరువు తగ్గడం గురించి అనిత ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
న్యాచురల్ గానే తాను బరువు తగ్గినట్టు ఆమె పేర్కొన్నారు.ఇలా మారడానికి నాకు ఏకంగా రెండున్నర సంవత్సరాల సమయం పట్టిందని ఆమె కామెంట్లు చేశారు.
నేను మరో ఐదు కిలోల బరువు తగ్గాలని అనుకుంటున్నానని అనిత పేర్కొన్నారు.ఇప్పుడు నా లక్ష్యం చాలా దూరంగా అనిపించడం లేదని ఆమె వెల్లడించారు.
అంతా మనకు అనుకూలంగానే ఉందని అనిత రాసుకొచ్చారు.కానీ ఇదంతా మనకు సులభం కాదని అనిత వెల్లడించారు.
బరువు తగ్గడం( Weight Loss ) కచ్చితంగా కష్టమేనని అయితే నేను తొందరపడలేదని ఆమె కామెంట్లు చేశారు.వెయిట్ లాస్ కోసం నేను ఎక్కువ సమయం తీసుకున్నందుకు సంతోషిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.నేను నా లక్ష్యానికి కొన్ని అడుగుల దూరంలో మాత్రమే ఉన్నానని అనిత చెప్పుకొచ్చారు.నటులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని ఆమె కామెంట్లు చేశారు.గతంలో నేను నా ప్రెగ్నెన్సీ( Pregnancy )ని ఆస్వాదించానని అనిత పేర్కొన్నారు.
మనం అన్నింటికీ మానసికంగా సిద్ధంగా ఉండాలని అనిత వెల్లడించడం గమనార్హం.2014 సంవత్సరంలో బిజినెస్ మేన్ రోహిత్( Businessman Rohit ) ను అనిత పెళ్లాడారు.తెలుగులో సుహాస్ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న అనిత ఈ సినిమా సక్సెస్ సాధిస్తే తెలుగులో బిజీ అవుతారు.
పారితోషికం విషయంలో సైతం ఈ నటి ఎక్కువగా డిమాండ్లు చేయడం లేదని సమాచారం అందుతోంది.అనితకు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.