బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavita )కు మరో షాక్ తగిలింది.ఆమెను సీబీఐ మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకోనుంది.
ఈ మేరకు కవితను సీబీఐ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది.
ఈ క్రమంలోనే కవితను సీబీఐ అధికారులు ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటల వరకు సీబీఐ కస్టడీ( CBI custody )లో ఉండనున్నారు.దీంతో రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) నుంచి కవితను సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించారు.అయితే సీబీఐ కస్టడీలో కవితను కలిసేందుకు భర్త, పిల్లలు, తల్లి, పీఏ కలిసేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను అరెస్ట్ చేసిన ఈడీ పలు ప్రశ్నలపై ఆమెను విచారించిన సంగతి తెలిసిందే.కాగా కవితను అరెస్ట్ చేసిన సీబీఐ ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది.
ఈ నేపథ్యంలో సీబీఐ అభ్యర్థనతో ఏకీభవించిన న్యాయస్థానం ఆమెను మూడు రోజులపాటు కస్టడీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.