ఈ రెండిటిని షాంపూ లో కలిపి వాడితే హెయిర్ ఫాల్ కు బై బై చెప్ప‌వ‌చ్చు!

మనలో చాలా మందిని బాధపెట్టే సమస్యల్లో హెయిర్ ఫాల్ ( Hair fall )అనేది ముందు వరుసలో ఉంటుంది.స్త్రీలే కాదు పురుషుల్లో కూడా ఎంతో మంది హెయిర్ ఫాల్ కారణంగా మదన పడుతుంటారు.

 If You Use These Two Together In The Shampoo, You Can Say Bye Bye To Hair Fall ,-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే జుట్టు రాలడాన్ని ఆపేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.రకరకాల హెయిర్ ప్యాకులు వేసుకుంటూ ఉంటారు.

అయినా సరే జుట్టు రాలడం ఆగడం లేదా.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని మీరు ఫాలో అవ్వాల్సిందే.

ఈ సింపుల్ రెమెడీతో చాలా సులభంగా హెయిర్ ఫాల్ సమస్యకు బై బై చెప్ప‌వ‌చ్చు.మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు నుంచి ఆరు మందారం పువ్వులు ( Hibiscus flowers )వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న మందారం పువ్వులను వాటర్ తో సహా వేసుకోవాలి.

అలాగే ఒక కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్ ( Aloe vera gel )వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో ఒక గ్లాసు వాటర్ మరియు మూడు టేబుల్ స్పూన్లు మీ రెగ్యులర్ షాంపూను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు ఈ విధంగా కనుక చేస్తే హెయిర్ రూట్స్ బలోపేతం అవుతాయి.జుట్టు రాలడం దెబ్బ‌కు కంట్రోల్ అవుతుంది.

హెయిర్ ఫాల్ ( Hair fall )ఎంత తీవ్రంగా ఉన్నా సరే ఈ రెమెడీతో స‌మ‌స్య అదుపులోకి వ‌స్తుంది.అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల సహజంగానే కురులు సిల్కీగా మారుతాయి.

అదే సమయంలో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.కాబట్టి హెయిర్ ఫాల్‌ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube