పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) సలార్ సినిమా( Salaar Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.మరి కొన్ని గంటలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే రాజమౌళి( Rajamouli ) సలార్ చిత్ర బృందాన్ని ఇంటర్వ్యూ చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను ప్రశ్నించారు.
అలాగే హీరోయిన్స్ శృతిహాసన్ గురించి కూడా ఈయన ప్రశ్నలు వేశారు.

శృతిహాసన్( Shruthi Hassan ) డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం ఇక ప్రభాస్ శృతిహాసన్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాలో కచ్చితంగా ఒక డ్యూయెట్ ఉంటుందని అందరూ భావిస్తారు కానీ ఎందుకు పాట పెట్టలేదు అంటూ ప్రశాంత్ ( Prashanth Neel ) ను రాజమౌళి ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ప్రశాంత్ సమాధానం చెబుతూ మొదట్లో పాట పెట్టాలని అనుకున్నాం కానీ ఈ సినిమా మొత్తం ఒక డ్రామాగా కొనసాగుతుందని అందుకే పాట పెట్టడం సరైంది కాదని భావించి వీరిద్దరి కాంబినేషన్లో ఒక డ్యూయెట్ పెట్టలేదని ప్రశాంత్ తెలిపారు.

ఏది ఏమైనా రాజమౌళి తనకు శృతిహాసన్ డాన్స్ అంటే ఇష్టం అంటూ ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.అయితే ఇప్పటివరకు రాజమౌళి డైరెక్షన్లో శృతిహాసన్ ఒక్క సినిమాలో కూడా నటించలేదు.తదుపరి సినిమాలలో అయినా ఈమెకు అవకాశం కల్పిస్తారేమో తెలియాల్సి ఉంది.
ఇక సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.మరి ఈ సినిమా ప్రభాస్ అభిమానులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.







