ఈ రెండిటిని షాంపూ లో కలిపి వాడితే హెయిర్ ఫాల్ కు బై బై చెప్పవచ్చు!
TeluguStop.com
మనలో చాలా మందిని బాధపెట్టే సమస్యల్లో హెయిర్ ఫాల్ ( Hair Fall )అనేది ముందు వరుసలో ఉంటుంది.
స్త్రీలే కాదు పురుషుల్లో కూడా ఎంతో మంది హెయిర్ ఫాల్ కారణంగా మదన పడుతుంటారు.
ఈ క్రమంలోనే జుట్టు రాలడాన్ని ఆపేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.రకరకాల హెయిర్ ప్యాకులు వేసుకుంటూ ఉంటారు.
అయినా సరే జుట్టు రాలడం ఆగడం లేదా.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని మీరు ఫాలో అవ్వాల్సిందే.
"""/" /
ఈ సింపుల్ రెమెడీతో చాలా సులభంగా హెయిర్ ఫాల్ సమస్యకు బై బై చెప్పవచ్చు.
మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు నుంచి ఆరు మందారం పువ్వులు ( Hibiscus Flowers )వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న మందారం పువ్వులను వాటర్ తో సహా వేసుకోవాలి.
అలాగే ఒక కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్ ( Aloe Vera Gel )వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
"""/" /
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జ్యూస్ లో ఒక గ్లాసు వాటర్ మరియు మూడు టేబుల్ స్పూన్లు మీ రెగ్యులర్ షాంపూను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ వాటర్ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా కనుక చేస్తే హెయిర్ రూట్స్ బలోపేతం అవుతాయి.
జుట్టు రాలడం దెబ్బకు కంట్రోల్ అవుతుంది.హెయిర్ ఫాల్ ( Hair Fall )ఎంత తీవ్రంగా ఉన్నా సరే ఈ రెమెడీతో సమస్య అదుపులోకి వస్తుంది.
అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల సహజంగానే కురులు సిల్కీగా మారుతాయి.అదే సమయంలో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.