తల్లి కారణంగా వెంకటేష్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ కోల్పోయిన ఐశ్వర్య..

టూ టౌన్ రౌడీ. 1989లో విక్టరీ వెంకటేష్ హీరోగా దాసరి నారాయణరావు తెరకెక్కించిన సినిమా.

బాలీవుడ్ లో అనిల్ కపూర్ మాధురీ దీక్షిత్ హీరో, హీరోయిన్లుగా చేసిన సూపర్ హిట్ మూవీ తేజాబ్ కు ఈ సినిమా రీమేక్.తెలుగు సినిమాలో హీరోయిన్ గా రాధ యాక్ట్ చేసింది.

అయితే ఈ సినిమాలో మొదటగా ఈమెను హీరోయిన్ గా అనుకోలేదట.సీనియర్ నటీమణి లక్ష్మి కూతురు ఐశ్వర్యను ఓకే చేశారట.

కానీ తన తల్లి మూలంగా ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందట.ఆ తర్వాత అడవిలో అభిమన్యుడు అనే సినిమా ద్వారా ఆమె తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

Advertisement

ఈ సినిమాలో హీరోగా జగపతిబాబు నటించాడు.ఇంతకీ ఐశ్వర్య టూ టౌన్ రౌడీ సినిమాలో నటించకపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకానొక సమయంలో లక్ష్మి హైదరాబాద్ నుంచి మద్రాసుకు విమానంలో వెళ్తుంది.అదే సమయంలో నిర్మాత రామానాయుడు అదే విమానంలో మద్రాసుకు బయల్దేరాడు.అతడు లక్ష్మిని చూసి పలకరించాడు.

మీ అమ్మాయి కూడా సినిమాల్లోకి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.నిజమేనా? అని అడిగాడు రామానాయుడు.అయితే అప్పుడే హోసకావ్య అనే కన్నడ సినిమాకు ఐశ్వర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అవున అని చెప్పిది లక్ష్మీ.వాళ్లిద్దరు కాసేపు ఐశ్వర్య గురించి మాట్లాడుకున్నారు.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

ఇద్దరూ మద్రాసు ఎయిర్ పోర్టులో దిగారు.మా ఇంటికి వెళ్లే రూట్ లోనే మీ ఇల్లు ఉంది కదా.ఓసారి మీ అమ్మాయిని చూస్తాను అని చెప్పాడు.సరే అని చెప్పింది లక్ష్మీ.

Advertisement

రామానాయుడు, ఆయన సతీమణి కలిసి కలిసి లక్ష్మీ వాళ్ల ఇంటికి వెళ్లాడు.

అమ్మాయి మా వెంకటేష్ సరసన నటించేందుకు చక్కగా సరిపోతుంది అన్నాడు రామానాయుడు.దర్శకుడు దాసరితో మాట్లాడి విషయం చెప్తాను అన్నాడు.దాసరి కూడా ఈమె ఫోటోలు చూసి ఓకే చెప్పాడు.

కానీ.ఈ సినిమాలో హీరోయిన్ స్వీమ్ షూట్ వేసుకోవాల్సి ఉంటుందని దాసరి చెప్పాడు.

దీనికి లక్ష్మీ అంగీకరించలేదు.స్విమ్ సూట్ వేసుకోవడానికి ఐశ్వర్యకు ఇబ్బంది లేకపోయినా.

లక్ష్మీ మాత్రం నో చెప్పింది.దీంతో ఐశ్వర్యకు ఈ సినిమాలో నటించే అవకాశాం తప్పిపోయింది.

తాజా వార్తలు