సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లు రావాలంటే పేరు మార్చుకోవాలనే ఒక ఆనవాయితీ అయితే చాలా సంవత్సరాల నుంచి వస్తుంది.ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది స్టార్ హీరోలు సైతం వాళ్ల పేర్లు మార్చుకొని సక్సెస్ లను అందుకున్న వారే… అందులో ముఖ్యంగా చిరంజీవి,( Chiranjeevi ) రజినీకాంత్,( Rajinikanth ) మోహన్ బాబు, రవితేజ, నాని లాంటి హీరోలు ఉన్నారు.
అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న సినీ మేధావులు సైతం మన దగ్గర టాలెంట్ ఉంటే సినిమాలో రాణిస్తాం అంతే తప్ప పేర్లు మార్చుకున్నంత మాత్రాన అవకాశాలు అయితే రావు, అలాగే సక్సెస్ అనేది రాదు.

అంటూ మరి కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే కొంతమంది హీరోలు పేర్లు మార్చుకున్నా కూడా సక్సెస్ లు అయితే సాధించలేకపోయారు.అందులో ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన నందమూరి తారకరత్న( Nandamuri Tarakaratna ) ఒకరు.
ఈయన ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేశాడు.అయినప్పటికీ ఆయనకి సరైన సక్సెస్ అయితే దక్కలేదు.
దాంతో ఆయన తొందరలోనే ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయాడు.ఇక నందమూరి తారకరత్న గత సంవత్సరం అనారోగ్య కారణాల వల్ల చనిపోయిన విషయం మనకు తెలిసిందే…

ఇక పేరు మార్చుకున్నా కూడా సక్సెస్ రాని మరొక హీరో జీవా.( Hero Jiiva ) ఈయన రంగం సినిమాతో తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.అయిన కూడా ఈయన ఎంటైర్ కెరియర్ లో రంగం సినిమాని మినహాయిస్తే ఈయనకి మరొక హిట్టు లేదనే చెప్పాలి.
ఈ రీసెంట్ గా యాత్ర 2( Yatra 2 ) సినిమాలో జగన్ క్యారెక్టర్ ని పోషించినప్పటికీ ఆ పాత్రతో కూడా ఆయనకి పెద్దగా సక్సెస్ అయితే సాధించలేకపోయాడు.ఇక ఈయన అసలు పేరు అమర్ చౌదరి( Amar Choudary ) కేవలం సినిమాల కోసం మాత్రమే తను జీవా గా పేరును చేంజ్ చేసుకున్నాడు.
అయినప్పటికీ ఈయన స్టార్ హీరోగా మాత్రం రాణించలేకపోయాడు.