తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి( Pawan Kalyan ) ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఈయన నటించిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా ఆయన చేసిన సేవా కార్యక్రమాలతో అంతకంటే ఎక్కువ గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ లో వాళ్ల అన్నయ్య అయిన చిరంజీవి కి తగ్గ తమ్ముడిగా కూడా మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
అందులో ముఖ్యంగా రమణ గోగుల( Ramana Gogula ) ఒకరు.

పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకి తననే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకొని ఆయన్ని ఎంకరేజ్ చేశాడు.ఆయన కెరియర్ డౌన్ లో ఉన్నప్పుడు అన్నవరం సినిమాతో( Annavaram Movie ) మరో అవకాశాన్ని కూడా ఇచ్చి తనని పైకి లేపే ప్రయత్నం అయితే చేశాడు.అలాగే హరీష్ పాయ్ మాస్టర్ కి( Harish Pai Master ) కూడా తన వరుస సినిమాల్లో కొరియోగ్రఫీ చేసే అవకాశాన్ని ఇచ్చి తనని టాప్ కొరియోగ్రాఫర్ గా మార్చాడు.ఇక పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ అయిన ఆనంద్ సాయిని( Anand Sai ) ఆర్ట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసి ప్రస్తుతం నెంబర్ వన్ ఆర్ట్ డైరెక్టర్ ఎదగడానికి కూడా ప్రయత్నం అయితే చేశాడు…

అలాగే బండ్ల గణేష్ ని( Bandla Ganesh ) ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాకుండా తనని స్టార్ ప్రొడ్యూసర్ గా మార్చడానికి కూడా తన వంతు సహాయమైతే చేశాడు.ఆయన చేసిన గబ్బర్ సింగ్ సినిమాతోనే బండ్ల గణేష్ స్టార్ ప్రొడ్యూసర్ గా మారాడు… ఇలా పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ లో చాలా మంది ఎంకరెజ్ చేస్తూ వాళ్ళకి ఒక మంచి లైఫ్ అయితే ఇచ్చాడు…
.







