తెలుగు సినీ నటుడు వికె నరేష్, పవిత్ర లోకేష్ ల వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.అయితే మొదట ఒక వార్తగా మొదలైన ఈ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది.
దీనితో ఎప్పటినుంచో సంపాదించుకున్న నరేష్ పేరు పరువు మొత్తం మంటగలిసి పోయింది.ఇదే విషయంపై నరేష్ భార్య రమ్య రఘుపతి కల్పించుకోవడంతో ఈ వివాదం కాస్త మరింత పెద్దది అయింది.
ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో నరేష్ కు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది.ఆ వీడియోలు నరేష్ మాట్లాడుతూ.
ఓ ఛానెల్‌లో నా గురించి ఎనిమిది గంటల ప్రోగ్రామ్ వేశారు.
అలా ఏ ఛానెల్‌లో అయినా వేస్తారా? నేను ఆ ఛానెల్ పేరు చెప్పాలనుకోవటం లేదు.అది చూస్తుంటే వన్ సైడ్ తీసుకున్నట్లు అనిపిస్తుంది.వారు నన్ను బ్లాక్ మెయిల్ చేయాలని అనుకుంటున్నారు.అయితే నేను ఆ ఛానెల్‌పై ఎలాంటి కంప్లయింట్ చేయటం లేదు.నేను రమ్య పైనే కంప్లైంట్ చేస్తున్నాను.
ఆ ఛానెల్ వాళ్లు చాలా కారణాలతో సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు.వారి మధ్య ఎలాంటి అండర్ స్టాండింగ్ ఉందో నాకు తెలియదు.