వైసీపీ ప్లీనరీ సమావేశంలో జీవితకాల అధ్యక్షుడిగా జగన్ ని ఎన్నుకొని.తీర్మానం ఆమోదించారు.
ఇదే క్రమంలో మరికొన్ని తీర్మానాలపై చర్చించి వాటిని కూడా ఆమోదించడం జరిగింది.ఈ తీర్మానల అనంతరం ప్రసంగించిన జగన్ తనని జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్లీనరీ సమావేశానికి వచ్చిన జనం ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.గుంటూరు విజయవాడ మధ్య జరుగుతున్న ఈ కార్యక్రమంలో జనాలు చూస్తుంటే సముద్రం గుర్తొస్తుందని పేర్కొన్నారు.
దశాబ్ద కాలం పాటు నాతోపాటు కష్టాలను అనేక అవమానాలను తట్టుకొని ఎన్నో త్యాగాలు చేసిన సైన్యం మీరు అంటూ వైసిపి కార్యకర్తలను పొగడ్తలతో ముంచెత్తారు.పార్టీకి సంబంధించిన బాధ్యతలను భావాలను ప్రజలలోకి తీసుకెళ్లి భుజాలపై వైసీపీ సిద్ధాంతాలను మోసిన నాయకులు మరియు అభిమానులు ఇంకా కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నట్లు జగన్ చెప్పకోచ్చారు.
మొదటి నుండి తనని నమ్మినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని వైయస్ జగన్ తనదైన శైలిలో ప్రసంగించారు.







