ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ దానిని వినియోగించుకుని వంద శాతం పోలింగ్ కు సహకరించాలని కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్న ప్రచారానికి దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సినీ నటులు పనిచేస్తున్నారు.వీరిలో తమిళ స్టార్ సూర్య కూడా ఒకరు.
అయితే తమిళనాడు అసెంబ్లీకి నిన్న జరిగిన ఓటింగ్ లో మాత్రం ఆయన పాల్గొనలేకపోయారు.తన ఓటు హక్కును ఆయన వినియోగించుకోలేదు.
విదేశాల్లో షూటింగ్ కోసం వెళ్లిపోయిన సూర్య ఓటు కోసం చెన్నై రాలేకపోయారు.
అయితే అందరూ ఓటేయాలంటూ తాను చేసిన ప్రచారాన్ని గుర్తుకు తెచ్చుకున్న ఆ నటుడు… తాను మాత్రం ఓటు వేయలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా ఓటు వేయలేకపోయిన తనను క్షమించాలని ఆయన ఓటర్లను కోరుతూ నిన్ననే ఓ ప్రకటన విడుదల చేశారు.







