Shivaji : శివాజీ ఇద్దరు కొడుకుల గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?

శివాజీ( SHIVAJI ) ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 లో అలరిస్తున్నటువంటి నటుడు.చాలా రోజులుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి శివాజీ తన గుర్తింపు ఎక్కడ తగ్గిపోతుందో అనే భయంతో ఏదో ఒక విధంగా ఉనికిని కాపాడుకోవడం కోసం బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొని తన సత్తా చాటుతున్నాడు.

 Shivaji : శివాజీ ఇద్దరు కొడుకుల గుర�-TeluguStop.com

తెలుగు సినిమా ఇండస్ట్రీకి మొట్టమొదటగా మాస్టర్ సినిమాతో పరిచయమయ్యాడు ఆ తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు చిన్నాచితకా వేషాలు వేసి కెరీర్ ముందుకు కొనసాగించాడు.అయితే శివాజీ 2003లో మిస్సమ్మ సినిమా( Missamma )లో నటించేంతవరకు సోలోగా ఒక హిట్ నీ కొట్టలేదు.

ఈ సినిమాతోనే అతడికి మంచి గుర్తింపు లభించింది ఆ తర్వాత 2016 వరకు వరుస పెట్టి అనేక సినిమాల్లో నటించాడు.

Telugu Sivaji, Bigg Boss, Bjp, Missamma, Shivaji, Tollywood, Venkat-Movie

అయితే శివాజీకి సంబంధించిన సినిమాల గురించి చాలామందికి తెలిసిన విషయాలే ఉన్నప్పటికీ అతడి కుటుంబం గురించి ఎవరికీ తెలియదు.శివాజీ సైతం తన కుటుంబం గురించి వీలైనంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడానికి ఇష్టపడతాడు.గుంటూరులోని నరసరావు పేటకు చెందిన శివాజీ భార్య పేరేంటో తెలియలేదు కానీ ఆయనకు ఇద్దరు పిల్లలు వారి పేర్లు శ్రీ మరియు వెంకట్( Venkat ) పెద్దబ్బాయి శ్రీ బీటెక్ పూర్తి చేసుకునే డిసెంబర్ లో మాస్టర్ చేయడం కోసం అమెరికా వెళుతున్నాడు.

చిన్నబ్బాయి ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్నాడు అతడు పేరు వెంకట్.వీరిద్దరూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉన్నారు అలాగే తన తండ్రి శివాజీ బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఆడుతుంటే బయట నుంచి వీరు గట్టిగా సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

Telugu Sivaji, Bigg Boss, Bjp, Missamma, Shivaji, Tollywood, Venkat-Movie

ఇద్దరు పిల్లలు కూడా డిసెంబర్ లోనే అమెరికా వెళ్తారని వారు పై చదువులు అంతా కూడా అక్కడే చేయాలని అనుకుంటున్నారని, అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలని తన పిల్లల గోల్ అంటూ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన తర్వాత ఒక సందర్భంలో శివాజీ తోటి ఇంటి సభ్యులతో కుటుంబం గురించిన కొన్ని విషయాలను పంచుకున్నారు.ఇక ప్రస్తుతం సినిమాల్లో నటించకపోయినా బిజెపి పార్టీ( Bjp party ) తరఫున పొలిటికల్ గా కూడా బిజీగానే ఉన్నాడు శివాజీ.ఇక బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత తన కెరియర్ సెటిల్ అవుతుందని మళ్లీ తిరిగి సినిమాల్లో బిజీ అవుతానని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube