రెమ్యునరేషన్ తగ్గించుకున్న శర్వానంద్.. కారణమేమిటంటే..?

స్టార్ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోలు హిట్లు వస్తే పారితోషికం పెంచడం, ఫ్లాప్ వస్తే రెమ్యునరేషన్ ను తగ్గించడం ఇండస్ట్రీలో సాధారణంగా జరుగుతుంది.

మంచి కథలు ఎంపిక చేసుకుంటున్న హీరోగా పేరు తెచ్చుకున్న శర్వానంద్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలేవీ నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టలేదు.

శర్వానంద్ గత సినిమా శ్రీకారం పాజిటివ్ టాక్ సంపాదించుకున్నా జాతిరత్నాలు సినిమా నుంచి గట్టి పోటీ ఎదురవడంతో నిర్మాతలకు నష్టాలు వచ్చాయి.ప్రస్తుతం శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు, మహాసముద్రం సినిమాలలో నటిస్తున్నారు.

మహాసముద్రం మూవీలో శర్వానంద్ తో పాటు హీరో సిద్దార్థ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా కొరకు శర్వానంద్ తను సాధారణంగా తీసుకునే రెమ్యునరేషన్ తో పోల్చి చూస్తే తక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

కరోనా దెబ్బకు సినిమా ఇండస్ట్రీకి ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే ఎక్కువగా నష్టాలు వచ్చాయి.

Advertisement

సినిమాలను నిర్మించాలంటే నిర్మాతలు తీవ్ర భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో ఉన్నాయి.గతంలో మాదిరిగా భారీ రెమ్యునరేషన్లు ఇవ్వడం నిర్మాతలకు తలకు మించిన భారంగా మారింది.ఈ కారణం వల్ల హీరో శర్వానంద్ స్వచ్చందంగా పారితోషికాన్ని తగ్గించుకున్నారని సమాచారం అందుతోంది.

ఆర్.ఎక్స్ 100 సినిమాతో హిట్ సాధించిన అజయ్ భూపతి డైరెక్షన్ లో మహాసముద్రం మూవీ తెరకెక్కుతోంది.

లాక్ డౌన్ కు ముందు 6 నుంచి 7 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం తీసుకున్న శర్వానంద్ కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తగ్గించుకున్నారని తెలుస్తోంది.తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ ఒకే సమయంలో రిలీజ్ కానుందని సమాచారం.ఈ సినిమాలో అదితిరావ్ హైదిరితో పాటు అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు.

పారితోషికాన్ని తగ్గించుకున్న శర్వానంద్ సినిమా రిలీజైన తర్వాత లావాదేవీలు చూసుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు