అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన నటుడు సందీప్ కిషన్.. ఏం జరిగిందంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో టాలెంట్ కలిగి ఉండి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో యంగ్ హీరో సందీప్ కిషన్ ఒకరు.ఈయన హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

 Actor Sandeep Kishan,michael Movie,monthly Subscriptions ,aha-TeluguStop.com

ఇకపోతే తాజాగా సందీప్ కిషన్ దివ్యాంశ కౌశిక్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం మైఖేల్.సందీప్ కిషన్ సినీ కెరియర్ లోనే ఈ సినిమా మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోయింది.

రంజిత్ జెయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో పెద్దగా సందడి చేయలేక పోయింది అయితే థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ఆహాలో ప్రసారం కానుంది.ఫిబ్రవరి 24 నుంచి ఈ సినిమా స్ట్రీమ్ అవ్వనుంది.ఈ విషయాన్ని అధికారికంగా ఆహా టీం ప్రకటించింది.

ఈ సందర్భంగా హీరో సందీప్ అభిమానులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు.

అభిమానులకు ఆహా వీడియో 2000 త్రైమాసిక సభ్యత్వాలను బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు.తనకు అన్ని సమయాలలో తనకు అండగా నిలిచి తనని ప్రోత్సహించిన అభిమానులకు ఈయన కృతజ్ఞతలు తెలియజేస్తూ అభిమానులకు ఈ అద్భుతమైన అవకాశాన్ని అందించారు.ఇక ఈయన నటించిన ఈ మైకేల్ సినిమాలో విజయ్ సేతుపతి.

వరలక్ష్మి శరత్ కుమార్.వరుణ్ సందేశ్.

గౌతం వాసుదేవ్ మీనన్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలలో నటించారు.థియేటర్లో పెద్దగా మెప్పించలేని ఈ సినిమా ఆహాలో ఎలా ప్రేక్షకులను మెప్పిస్తుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube