ఒడిశాలో మ‌రో సోనూసూద్.. రియ‌ల్ హీరో అంటూ ప్ర‌శంస‌లు!

క‌రోనా వైర‌స్‌.ఎన్ని కుటుంబాల‌ను చిన్నాభిన్నం చేసిందో లెక్కే లేదు.

ముఖ్యంగా కంటికి క‌నిపించ‌ని ఈ క‌రోనాకు అడ్డుక‌ట్ట వేసేందుకు లాక్‌డౌన్ విధించ‌డంతో ప్ర‌జ‌లు ప‌డిన తిప్ప‌లు అన్నీ ఇన్నీ కావు.అయితే ఈ లాక్‌డౌన్ కాలంలో సినీ న‌టుడు సోనూసూద్ చేసిన సాయం ఎవ‌రూ అంత త్వ‌ర‌గా మరువలేరు.

లాక్‌డౌన్ కార‌ణంగా ఎక్క‌డెక్క‌డో చిక్కుకుపోయిన‌ వలస కార్మికులు, విద్యార్థుల‌ను బస్సులు, రైళ్లు ద్వారా వారి సొంతూర్లకు త‌ర‌లించాడు.విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని సైతం సొంత ఖ‌ర్చుతో ఇండియాకు తీసుకువ‌చ్చారు.

అంతేకాదు ఎవ‌రు ఏ సాయం అడిగినా.కాదు, లేదు అన‌కుండా ముందుకొచ్చే సోనూసూద్ అంద‌రితోనూ రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు.

Advertisement

అయితే సోనూసూద్‌ లాగే ఒడిశాకు చెందిన సినీ హీరో సబ్యసాచి మిశ్ర కూడా లాక్‌డౌన్‌లో క‌ష్టాలు ప‌డుతున్న‌ పేదలకు త‌న‌వంతు సాయం చేస్తూ రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు.ఇతర రాష్ట్రాలు, దుబాయ్‌లో చిక్కుకున్న వందలాది మందిని సబ్యసాచి మిశ్ర సొంత ఖర్చు పెట్టుకుని ఒడిశా తీసుకొచ్చాడు.

అలాగే ఒడిశాలో చిక్కుకుపోయిన ఇత‌ర రాష్ట్రాల విద్యార్థుల‌ను కూడా ప్రత్యేక బస్సులలో వారి సొంత రాష్ట్రాల‌కు త‌ర‌లించి మంచి మ‌న‌సు చాటుకున్నాడు.అంతేకాదు, ఈయ‌న‌కు `స్మైల్‌ ప్లీజ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ కూడా ఉంది.

ఈ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తూ.అంద‌రికీ నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాడు.

లాక్‌డౌన్ కార‌ణంగా ఆక‌లితో అల‌మ‌టించిపోతున్న పేదవారికి ఆహారాన్ని పంచిపెట్టాడు.క‌రోనా కారణంగా ఆగిపోయిన పెళ్లిళ్లు జ‌రిపించాడు.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
షాకింగ్ వీడియో : ఏడేళ్ల బాలుడిని ఢీ కొట్టిన బైకర్.. రోడ్డు దాటుతుండగా ప్రమాదం..

లాక్‌డౌన్ కారణంగా వ‌స‌తిలేని వారికి వ‌స‌తి స‌దుపాయాల‌ను క‌ల్పించారు.ఇలా క‌రోనా క‌ష్ట‌కాలంలో ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ.

Advertisement

రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు.ఇక సబ్యసాచి మిశ్ర గురించి తెలిసిన వారంద‌రూ మ‌రో సోనూసూద్ అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

తాజా వార్తలు