అద్భుతమైన కామెడీ టైమింగ్ తో తెలంగాణ యాసతో నవ్వులు పూయించడంలో ప్రియదర్శి సపరేట్ పాత్ ను క్రియేట్ చేసుకున్నారు.ఇలా యాసలో పర్ఫెక్ట్ టైమింగ్ తో కామెడీ చేసే అతితక్కువ కమెడియన్లలో ప్రియదర్శి ముందుంటాడు.
పక్కా హైదరాబాదీ అయిన ఈ నటుడికి చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి .ముఖ్యంగా విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన సాగర సంగమం, మెగస్టార్ చిరంజీవి రుద్రవీణ సినిమాలకు బాగా అట్రాక్ట్ అయ్యాడు.అప్పటి నుంచి సినిమాల్లోకి రావాలని కలలు కన్నాడు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసిన ప్రియదర్శి నటనపై మక్కువతో ఆఫర్లకోసం ప్రయత్నించాడు.
ఓ వైపు షార్ట్ ఫిల్మిం చేస్తూనే మరోవైపు స్టూడియోల చుట్టూ తిరిగాడు.అలా 2016లో శ్రీకాంత్ హీరోగా యాక్ట్ చేసిన టెర్రర్ సినిమాలో టెర్రరిస్ట్ గా అవకాశం వచ్చింది.
అదే ఏడాది తరుణ్ భాస్కర్ డైరక్షన్ లో రొమాంటిక్ కామెడీ మూవీ పెళ్లి చూపులతో ఆకట్టుకున్నాడు.నా చావు నేను చస్తానంటూ చేసిన హడావిడి అంతా ఇంతా కదా.సినిమా విడుదలై విమర్శకుల ప్రశంసలందుకున్నాడు.
తెలంగాణ యాసలో ప్రియదర్శి చెప్పే డైలాగ్స్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు.
దీనికి కారణం తన తండ్రేనని చెబుతారు.తన తండ్రికి పుస్తకాలు చదవడం అంటే ఇష్టం.
ఆ ఇష్టంతోనే కవితాత్మకంగా పద్యాలు రాసేవారు.అలా కవితాత్మక పద్యాల వల్లే కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుదని చెప్పాడు.
దీంతో పాటు వివేకానందుడి ప్రభావం తనపై ఎక్కువ ఉందని చెప్పే ప్రియదర్శి.ఆయన లక్షణాలు ఉండాలనే ఉద్దేశంతో తన తాత తనకి ప్రియదర్శి అని పేరు పెట్టినట్లు తెలిపాడు.
ప్రియదర్శి అంటే వివేకానందుడి మరోపేరు.అందుకే తన పేరు ప్రియదర్శి అయ్యిందని తనపేరులో ప్రియని రివిల్ చేశారు.