టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో గుర్తింపు ఉన్న నటులలో ప్రభు ఒకరు కాగా ప్రభు( Actor Prabhu ) ఇప్పటికీ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.ప్రభు వయస్సు ప్రస్తుతం 66 సంవత్సరాలు కాగా తండ్రి పాత్రలలో నటిస్తూ ప్రభు మెప్పిస్తున్నారు.
ప్రభు దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు కాగా ఐశ్వర్య, డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ ప్రేమించుకున్నారని త్వరలో పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది.
ఇరుకప్పపుట్టు మూవీ షూటింగ్ సమయంలో ఐశ్వర్య,( Aishwarya ) అధిక్ ప్రేమలో పడ్డారని సమాచారం అందుతోంది.ఐశ్వర్యకు ఇది సెకండ్ మ్యారేజ్ కావడం గమనార్హం.2009 సంవత్సరంలో ఐశ్వర్యకు తన బంధువైన కునాల్ తో మ్యారేజ్ జరిగింది.ఆ తర్వాత ఐశ్వర్య దంపతులు అమెరికాలో స్థిరపడ్డారు.భర్తతో విబేధాలు రావడంతో ఆమె విడిపోయారు.కుటుంబంతో ఉన్న ఐశ్వర్య అధిక్ తో( Director Adhik Ravichandran ) పెళ్లి తర్వాత సంతోషంగా జీవనం సాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
డిసెంబర్ నెల 15వ తేదీన ఐశ్వర్య దంపతుల పెళ్లి జరుగుతుండటం గమనార్హం.త్వరలోనే ఈ పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం అందుతోంది.మార్క్ ఆంటోని( Mark Antony Movie ) సినిమాతో అధిక్ రవిచంద్రన్ తాజాగ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకుంది.అజిత్ 63వ సినిమాకు కూడా అధిక్ డైరెక్టర్ అని తెలుస్తోంది.
అధిక్ రవిచంద్రన్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.అధిక్ రవిచంద్రన్ కెరీర్ పరంగా సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.అధిక్ రవిచంద్రన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.ఐశ్వర్య భవిష్యత్తులో కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాలి.అధిక్ రవిచంద్రన్ మాత్రం భాషతో సంబంధం లేకుండా సత్తా చాటాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.