ప్రముఖ టాలీవుడ్ నటుడు మురళీ మోహన్ ( Murali Mohan )ఈ మధ్య కాలంలో సినిమాలకు, పొలిటికల్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.అడపాదడపా సినిమాలలో మురళీ మోహన్ నటిస్తున్నా ఆ సినిమాలలో మరీ గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలను అయితే ఎంచుకోవడం లేదు.
అయితే మురళీ మోహన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
నా వయస్సు 83 అని మురళీ మోహన్ అన్నారు.
సినిమా ఇండస్ట్రీలో 50 సంవత్సరాల కెరీర్ ఉందని ఆయన కామెంట్లు చేశారు.రాజకీయాలకు నేను వ్యతిరేకం అని మురళీ మోహన్ అన్నారు.
మా నాన్న స్వాతంత్ర సమర యోధుడు అని ఆయన కామెంట్లు చేశారు.సీనియర్ ఎన్టీఆర్( Senior NTR ) ను ఒక సందర్భంలో కలవగా నేను అన్నింటికీ తెగించి రాజకీయాల్లోకి వచ్చానని ఎన్టీఆర్ చెప్పారని మురళీ మోహన్ కామెంట్లు చేశారు.

మీరు రావద్దని సీనియర్ ఎన్టీఆర్ చెప్పారని ఆయన అన్నారు.కాంగ్రెస్ పార్టీ ( Congress party )వాళ్లు చాలా ఘోరంగా ఎన్టీఆర్ పై విమర్శలు చేశారని మురళీ మోహన్ తెలిపారు.సీనియర్ ఎన్టీఆర్ పాపులారిటీ చూసి ఇందిరా గాంధీ భయపడ్డారని ఆయన చెప్పుకొచ్చారు.నేను చేసే ఏ వ్యాపారం ఎవరికీ చెప్పలేదని మురళీ మోహన్ అన్నారు.సినిమా ఆర్టిస్టులు పార్టీలకు దూరంగా ఉండాలని ఆయన తెలిపారు.

చంద్రబాబు( Chandrababu ) నాకు భూమూలు ఇచ్చారని ప్రచారం చేశారని మురళీ మోహన్ తెలిపారు.నా దగ్గర ప్రభుత్వ స్థలం ఉందని తెలిస్తే ప్రూవ్ చేయాలని ఛాలెంజ్ చేశానని ఆయన అన్నారు.అమరావతిలో సెంట్ ల్యాండ్ లేదని ఆయన అన్నారు.
మంగళగిరిలో డెవలప్మెంట్ కు మాత్రం ల్యాండ్ తీసుకున్నానని మురళీ మోహన్ అన్నారు.నా కెరీర్ లో బ్లాక్ మార్క్ లేదని ఆయన తెలిపారు.
ఎలక్షన్స్ కోసం డబ్బులు ఖర్చు చేయాలని అయన తెలిపారు.