ఈనెల 2 నుంచి 22 వరకు మూడు వారాలపాటు తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాల( Telangana decade celebration ) పేరిట ప్రజాదనాన్ని ఖర్చు చేసి రాజకీయ ప్రచారం కేసిఆర్( CM KCR ) చేసుకున్నారని ఈ దశాబ్ద ఉత్సవం ప్రజల పండగ కాదని కేవలం ప్రభుత్వ దండగ కార్యక్రమాo అనీ ఆయన అన్నారు.గురువారం నాడు స్థానిక రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజాపంద నగర నాయకురాలు అమరుడు దొరన్న జీవిత భాగస్వామి అయినా కామ్రేడ్ గడ్డం వెంకట్ నరసమ్మ మొదటి వర్ధంతి సభా సందర్భంగా జరిగిన సభలో ఆయన ముఖ్యఅతిదిగా పాల్గొని మాట్లాడారు.
ఆయన మాట్లాడుతూ దశాబ్ద ఉత్సవాల పేరిట కెసిఆర్ రాష్ట్ర బడ్జెట్ మంచినీళ్లు లాగా ఖర్చు పెట్టి తిరిగి రాజకీయ లబ్ధి పొందేందుకు రాజకీయ ప్రచారం చేయించుకున్నారని ఆయన ఆరోపించారు.ఏ ఒక్క పథకం కూడా 100% అమలు కాలేదని ఇందుకు కేసిఆర్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన అన్నారు .వెంకట నరసమ్మ సుదీర్ఘకాలం పాటు రాజ్యం పెట్టిన చిత్రహింసల్ని బరాయిస్తూ ,అమరుడు దోరాన్న కు అండగా ఉన్నారని, ఎన్ని వేధింపులు, కేసులు, బెదిరింపులు, చేసిన ధైర్యంతో దోరన్న ఉద్యమ జీవితానికి ఆటంకంక మారకుండా వర్గ పోరాటలు ముందుకు తీసుకెళ్లేందుకు తన శక్తి వంచన లేకుండా సహకరించారని ఆయన అన్నారు.కమ్యూనిస్టుల( CPI (ML ) మార్గం అంటే చాలా కఠినమైనది ఉన్నతమైనదని నీతి నిజాయితీ నిబద్దత కష్టాలు కన్నీళ్లు కడగండ్లు ఇవన్నీ ఉంటాయని వాటిని ఎదుర్కొని కమ్యూనిస్టు ఆశయంలో ముందుకు నడిచారని ఆయన అన్నారు.
అట్లాంటి త్యాగపూరితమైన జీవితాన్ని కమ్యూనిస్టులు అందరూ ఆదర్శంగా స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజాపంధ జిల్లా సీనియర్ నాయకులు గుర్రం ఆచ్చయ్య ,ఆవుల వెంకటేశ్వర్లు, జి రామయ్య ,సివైపుల్లయ్య ఆవుల అశోక్ మాలీది నాగేశ్వరరావు ఝాన్సీ మంగతాయి శిరోమణి ఆజాద్ కమ్మ కోమటి నాగేశ్వరరావు కే శ్రీనివాస్ అరుణోదయ శ్రీను తదితరులు పాల్గొన్నారు







